చిదంబ‌రానికి ఇంటిఫుడ్‌ కు ఓకే..

Update: 2019-10-03 15:21 GMT
హ‌మ్మ‌య్య ఎట్ట‌కేల‌కు కోర్టు  కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి పి. చిదంబ‌రం ఈనెల 17వ తేదీ వ‌ర‌కు జుడిషియ‌ల్ క‌స్ట‌డీలోనే ఉండ‌నున్నారు. ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో ఆయ‌న క‌స్ట‌డీని పొడిగిస్తూ ఇవాళ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తొలుత ఇచ్చిన 14 రోజుల రిమాండ్ గ‌డువు ముగియ‌డంతో.. సీబీఐ ఇవాళ చిదంబ‌రాన్ని కోర్టు ముందు ప్ర‌వేశ‌పెట్టింది. మ‌రో మూడు రోజులు రిమాండ్‌ ను పొడిగించింది. అడిష‌న‌ల్ సెష‌న్స్ జ‌డ్జ్ ఏకే కుహ‌ర్ ఈ కేసులో అరెస్టు గ‌డువును పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో చిదంబ‌రానికి బెయిల్ ఇవ్వాల‌ని కోర్టును గ‌తంలో చిదంబ‌రం పిటిష‌న్ వేయ‌గా బెయిల్ ఇవ్వ‌కుండా పిటిష‌న్‌ ను కొట్టివేసింది.  దీంతో తీహార్ జైలుకు త‌ర‌లించారు.

ఇప్పుడు మ‌రోసారి రిమాండ్ పొడిగించ‌డంతో చిదంబ‌రం ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. అయితే ప్ర‌స్తుతం తీహార్ జైలులో ఉంటున్న చిదంబ‌రానికి కోర్టు కొంత ఊర‌ట క‌ల్పించింది. ఇంటి నుంచి తెచ్చిన భోజ‌నాన్ని తినేందుకు ఆయ‌న‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. గ‌తంలో ఇంటి ఫుడ్‌ కు కోర్టు అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఇప్పుడు మాత్రం ఈ విష‌యంలో కోర్టు కాస్త మిన‌హాయింపు ఇచ్చింది. ఇక పోతే చిదంబ‌రం ఆరోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా  వైద్య స‌దుపాయం కోసం బ‌య‌ట ఆస్ప‌త్రుల‌కు వెళ్లేందుకు కూడా కోర్టు అంగీక‌రించింది. అయితే మ‌రోసారి బెయిల్ కోసం చిదంబ‌రం ప్ర‌య‌త్నించారు.

ఈ మేర‌కు  బెయిల్ ఇవ్వాలంటూ ఇవాళ ఉద‌యం చిదంబ‌రం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. చిదంబ‌రం త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. బెయిల్ పిటిష‌న్‌ ను విచారించేందుకు సుఫ్రీం కోర్టు నిర్ణ‌యం తీసుకోనుంది. అయితే చిదంబ‌రం మ‌నిలాండ‌రింగ్ కేసులో ఇరుక్కుని దాదాపుగా 20రోజుల‌కు పైగా తీహ‌ర్ జైలులోనే గ‌డుపుతున్నారు. కేంద్రంలో యూపీలో ప్ర‌భ‌త్వ హ‌యాంలో చ‌క్రం తిప్పిన చిదంబ‌రం ఇప్పుడు క‌ట‌క‌టాలు లెక్కిస్తుండ‌టం విశేషం.


Tags:    

Similar News