సంగారెడ్డి కాంగ్రెస్ ఎంఎల్ఏ టి జయప్రకాష్ రెడ్డి @ జగ్గారెడ్డి తొందరలోనే పాదయాత్ర చేయబోతున్నారు. రైతు సమస్యలతో పాటు మామూలు జనాలు పడుతున్న అవస్తలను, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు తొందరలోనే తాను పాదయాత్ర చేయబోతున్నట్లు స్వయంగా జగ్గారెడ్డే ప్రకటించారు. ఎంఎల్ఏ చేసిన ప్రకటనతో పార్టీలోని చాలామంది సినియర్ నేతలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే తొందరలోనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది.
వర్కింగ్ ప్రెసిడెంట్ హాదాలో రేవంత్ ములుగు నియోజకవర్గం నుండి పాదయాత్ర మొదలుపెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతుంటో ఇదే సమయంలో జగ్గారెడ్డి పాదయాత్రను ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. రేవంత్ చేస్తారని అనుకుంటున్న పాదయాత్రకు పోటీగా జగ్గారెడ్డి పాదయాత్ర చేస్తానని చెప్పారా అన్న సందేహాలు అందరిలోను పెరిగిపోతున్నాయి.
జగ్గారెడ్డి మాట్లాడుతూ కేసీయార్ పాలనలో అన్నీ వర్గాల ప్రజలు నానా అవస్తలు పడుతున్నట్లు ఆరోపించారు. రాష్ట్రంలోని జనాలను ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నాయంటు పెద్ద ఎత్తున విమర్శించారు. కేసీయార్ అనాలోచిత నిర్ణయాలు, విధానాల వల్ల యావత్ రైతాంగంతో పాటు మామూలు జనాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. కేసీయార్ సూచనల ప్రకారం తెలంగాణా వరి సాగుచేసిన రైతులకు గిట్టుబాటు ధరలు లేక రైతాంగం భారీ నష్టాల్లో కూరుకుపోతున్నట్లు మండిపడ్డారు.
తన పాదయాత్ర ప్రధానంగా రైతు, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే అని స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటమే తన పాదయాత్ర ఉద్దేశ్యంగా వివరించారు. తొందరలోనే పాదయాత్ర రూట్ మ్యాప్ ను ప్రకటిస్తానని కూడా చెప్పారు. రైతు, ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టే విధంగా కేసీయార్ పై ఒత్తిడి పెంచుతానని జగ్గారెడ్డి గట్టిగా ప్రకటించారు.