రికార్డు అనగానే చాలా మంది మనసులో విజేతలే మెదులుతారు. కానీ.. ఓడిపోయిన వారు కూడా చారిత్రక రికార్డులు నెలకొల్పుతారు. ఇంకా చెప్పాలంటే గిన్నీస్ బుక్కులోనూ స్థానం సంపాదిస్తారు. అలాంటి పరాజిత వీరుడే పద్మరాజన్.
తమిళనాడులోని సేలం జిల్లా మేట్టూరకు చెందిన పద్మరాజన్ ఎన్నికల్లో ఓడిపోయి ఏకంగా గిన్నీస్ బుక్ రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటి వరకూ ఆయన 218 సార్లు ఎన్నికల్లో బరిలో నిలిచి ఓడిపోవడమే ఈ ఘనతకు కారణం.
1989 నుంచి మొదలైన ఆయన ప్రస్థానం.. ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఆ సంవత్సరం నుంచి జరిగే పలు ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తూ వస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు అసెంబ్లీ, పార్లమెంట్, ఆఖరికి రాష్ట్రపతి ఎన్నికల వరకు ఆయన పోటీ చేస్తూనే ఉన్నారు!
తాజాగా జరిగిన తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు పళనిస్వామి, పినరయి విజయన్ పై పోటీకి దిగారు. తన సొంత నియోజకవర్గం మేట్టూరులో కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఈ పోటీతో ఆయన ఇప్పటి వరకూ 218 సార్లు నామినేషన్ దాఖలు చేసినట్టు రికార్డుల్లో నమోదైంది. పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటే ఇదేకాబోలు!