కేరళలో జరిగి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఒక కీలక విషయంపై తాజాగా హైకోర్టు తన తుది తీర్పు ఇచ్చింది. ఈ సమయంలో అంతకు మించి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆన్ లైన్ వేదీకగా దేశవ్యాప్తంగా వైరల్ గా మారుతున్నాయి. ఫలితంగా కేరళ సామాజిక ఉద్యమకారిణి రెహానా ఫాతిమా మరోసారి వార్తల్లో నిలిచారు.
శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ గతంలో ఉద్యమాన్ని నడిపించారు కేరళ సామాజిక ఉద్యమకారిణి రెహానా ఫాతిమా. శబరిమలలో మహిళల ప్రవేశాన్ని కల్పిస్తూ ఉద్యమించిన సమయంలో బిందు, కనకదుర్గతో కలిసి రెహానా ఫాతిమా శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో మత విధ్వేషాలను రెచ్చగొడుతున్నారనే కారణంతో ఆమెపై అనేక కేసులు పెట్టారు.
ఆ సంగతి అలా ఉంటే... అనంతరం తన అర్ధ నగ్న శరీరంపై కుమారుడు, కూతురితో బాడీ పెయింట్ వేయించుకున్నారు ఫాతిమా. ఆ సమయంలో చిత్రీకరించిన వీడియోని ఆమె యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఫలితంగా... పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. అయితే తాజాగా ఈ కేసుపై తుదితీర్పునిచ్చిన హైకోర్టు... ఈ కేసును కొట్టేసింది.
మహిళ నగ్న శరీరాన్ని చూడటం అనేది లైంగిక పరమైన చర్యగా పరిగణించడం లేదని వ్యాఖ్యానించిన హైకోర్టు... నగ్న శరీరంపై పెయింట్ వేయించుకోవడాన్ని అశ్లీలంగా, అసభ్యకరంగా పేర్కొనలేమని స్పష్టం చేసింది.
ఈ మేరకు జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ తుది తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి!
తన పిల్లలు బొమ్మలను చిత్రీకరించడానికి ఒక తల్లి తన శరీరాన్ని కాన్వాస్ గా మలచుకోవడంలో తప్పు లేదని మొదలుపెట్టిన ఆయన... నగ్నత్వం విషయంలో మగ, ఆడ శరీరాలు వేర్వేరుగా చూడటం సరికాదని తెలిపారు.
పులికలి మొదలైన సంప్రదాయబద్ధమైన వేడుకల్లో పురుషులపై బాడీ పెయింటింగ్ వేయడానికి సమాజం అంగీకరిస్తుందని.. అలాంటప్పుడు మహిళ నగ్న శరీరాన్ని శృంగారపరమైన వస్తువుగా లైంగిక కోణంలో చూడటం సరికాదని ఈ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
కాగా... రెహానా ఫాతిమాకు 12 సంవత్సరాల వయస్సున్న కుమారుడు, 14 సంవత్సరాల వయస్సున్న కుమార్తె ఉన్నారు. వీరిద్దరితో రెహానా ఫాతిమా తన బాడీపై పెయింట్ వేయించుకున్నారు. టాప్ లెస్ గా ఉన్న ఆమె శరీరంపై ఆమె కొడుకు, కూతురు పెయింట్ వేస్తోన్న దృశ్యాలను వీడియోలో రికార్డు చేశారు. దాన్ని యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. 19 నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియో కేరళలో దుమారం రేపిన సంగతి తెలిసిందే! అయితే జూన్ - 2000 లో జరిగిన ఈ ఘటనపై తాజాగా హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది!