భారత్‌పై నిత్యం విషం కక్కే పాకిస్తాన్ తాజాగా శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో మందిర నిర్మాణంపై అక్కసు వెళ్లగక్కింది. భారత ప్రభుత్వం హిందుత్వ అజెండాతో వెళ్తోందని అర్థంలేని ఆరోపణలు గుప్పిస్తోంది. పాకిస్తాన్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల హిందువుల ఇళ్లను కూల్చివేసి, నిలువ నీడ లేకుండా చేశారు. వీటన్నింటిని పక్కదారి పట్టించేందుకు దాయాది రామమందిరంపై విషం కక్కే ప్రయత్నం చేసింది.
బాబ్రీ మసీదు స్థలంలో రామాలయం నిర్మిస్తున్నారని, ముస్లీంలపై వివక్షకు ఇది నిదర్శనం అని అరోపించింది. అయితే అక్కడ శతాబ్దాల క్రితం ఉన్న రామమందిరాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించారు. పాకిస్తాన్ చరిత్రను పక్కదారి పట్టిస్తూ భారత్ అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకుంటోంది. మసీదు స్థానంలో రాముడి గుడి నిర్మించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది.
ప్రపంచమంతా కరోనాతో సతమతమవుతుంటే బీజేపీ ప్రభుత్వం మాత్రం హిందుత్వ అజెండాతో ముందుకు సాగుతోందని విమర్శించింది. కరోనా కేసులు భారత్‌లో ఈ రోజు నాటికి లక్షా 60వేలు ఉంటే, మరణాలు 4,560 ఉన్నాయి. పాకిస్తాన్‌లో కూడా ఏకంగా 60వేలకు పైగా కేసులు, 1260 మరణాలు ఉన్నాయి. పైగా కరోనా కట్టడిలో భారత్‌ను ప్రపంచ సంస్థలు మెచ్చుకుంటున్నాయి. మర్కజ్ లేకుంటే ఇన్ని కేసులు ఉండకపోయేవి అనే అభిప్రాయం ఉంది. కానీ పాక్ ఇదే కరోనా టైంలో అక్కడి హిందువుల ఇళ్లను కూల్చుతూ దానిని పక్కదారి పట్టేంచేలా భారత్ అంతర్గత విషయమైన రామమందిర నిర్మాణం గురించి మాట్లాడుతోంది.
అయోధ్య స్థల వివాదంపై సుప్రీం కోర్టు గత ఏడాది నవంబర్ నెలలో తీర్పు చెప్పింది. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ్ లల్లాకు అప్పగిస్తూ తీర్పు చెప్పింది. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల స్థలనం కేటాయించాలని ఆదేశించింది. ఈ తీర్పును కూడా పాక్ తప్పుబట్టడం గమనార్హం. పాకిస్తాన్‌లో స్వాతంత్రానంతరం 15 శాతానికి పైగా ఉన్న హిందువులు ఇప్పుడు కనీసం ఒక్క శాతం కూడాలేరు. అలాంటి పాక్ భారత్‌పై విషం కక్కుతోంది.