ఓ పాకిస్థాన్ దేశీయుడు ఇండియాకు ఏ రకంగానూ మద్దతు ప్రకటించడం అన్నది జరగని విషయం. అందులోనూ క్రికెట్ విషయానికి వస్తే అభిమానులు మరింత పట్టుదలతో ఉంటారు. అలాంటిది ఓ పాకిస్థాన్ క్రికెట్ వీరాభిమాని ఇండియాకు సపోర్ట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ లు చూసేవాళ్లకు చాచా బాబాయ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పొడవాటి గడ్డంతో.. పాకిస్థాన్ క్రికెటర్లు వేసుకునే పచ్చ రంగు దుస్తులే వేసుకుని.. పాక్ జాతీయ జెండాను ఊపుతూ స్టేడియంలో సందడి చేస్తుంటాడు చాచా. అతను పాక్ జట్టుకు వీరాభిమాని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి వీరాభిమాని.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు భారత జట్టుకు మద్దతుగా మాట్లాడాడు.
జూన్ 4న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతోందో అతను ముందే చెప్పేశాడు. ఈ మ్యాచ్ లో భారతే విజేత అని ప్రకటించాడు. ‘‘వార్ వన్ సైడే.. ధోని.. కోహ్లి.. యువరాజ్ లాంటి స్టార్లను ఢీకొట్టే సత్తా ప్రస్తుత పాకిస్థాన్ జట్టుకు లేదు’ అని చాచాలా తేల్చి చెప్పేశాడు. ఎప్పుడూ పాక్ జట్టుతో ఉండే చాచా ఈ మ్యాచ్ కు హాజరు కావట్లేదు. మక్కా పర్యటనలో ఉండటమే ఇందుకు కారణం. కరాచికి చెందిన చాచా అమెరికాలోని చికాగోలో రెస్టారెంట్ యజమానిగా స్థిరపడ్డాడు. భారత జట్టు ఆడే ప్రతి మ్యాచ్ కూ హాజరయ్యే సుధీర్ చౌదరి తనకు ఫోన్ చేసి.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కు వస్తున్నావా అని అడిగానని.. రాలేనని చెప్పానని.. ఇండియా-పాక్ మ్యాచ్ అంటే ఒకప్పుడున్నంత మజా ఇప్పుడు లేదని.. తమ జట్టు బలహీన పడిపోయిందని.. భారత జట్టు బాగా బలంగా మారిందని.. ఇండియాను ఢీకొట్టే సత్తా తమ వాళ్లకు ఇప్పుడు లేదని చాచా అభిప్రాయపడ్డాడు. చాచా అసలు పేరు.. బషీర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/