ముజాహిదీన్ లను సృష్టించి తప్పు చేశామంటున్న పాక్..!

Update: 2023-02-02 13:20 GMT
భారత్.. పాక్ దేశాలకు ఒకేసారి స్వత్రంత్రం పాక్ లో మాత్రం ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగడం లేదు. పాక్ రాజకీయాలను ఆర్మీ.. ఉగ్రవాదులే శాసిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ లో కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదన్నట్లుగా అక్కడి పరిస్థితి మారిపోయింది.

దీనికితోడు రోజురోజుకు పెరుగుతున్న ఉగ్రవాదం పాకిస్తాన్ ను ఇంటా బయటా అభాసుపాలు చేస్తోంది. ఇటీవల అప్ఘనిస్తాన్ ను తాలిబాన్లు ఆక్రమించుకోవడానికి పాకిస్థాన్ అన్నివిధలా సహకారం అందించిందనే వార్తలు విన్పించాయి. దీంతోనే తాలిబాన్లు అఫ్ఘనిస్తాన్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేసి వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అప్ఘనిస్తాన్ కాస్తా తాలిబన్ రాజ్యంగా మారింది.

తాలిబన్లు ప్రస్తుతం చీకటి పాలన కొనసాగుతోంది. మహిళలపై అనేక ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముస్లిం సంప్రదాయాల పేరుతో తాలిబన్లు ఇష్టనుసారంగా అక్కడి ప్రజలు ఆంక్షలు విధిస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగే కాల్చి వేస్తుండటంతో గత్యంతరలేక ప్రజలంతా తాలిబన్లు చెప్పినట్లే చేస్తున్నారు. మరోవైపు అప్ఘనిస్తాన్ నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

అఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించినట్లుగానే పాకిస్థాన్ సైతం హస్తం చేసుకునేందుకు తాలిబన్లు పాక్ ఉగ్రవాదులతో చేతులు కలిపారు. ఈక్రమంలోనే పాకిస్తాన్ రోజుకో మరణహోమం వెలుగచూస్తోంది. పాక్ సరిహద్దుల్లో నిత్యం తాలిబన్లకు పాక్ పోలీసులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లోనే పాక్ కు చెందిన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇదిలా ఉంటే పాకిస్థాన్ లోని పెషావర్ మసీదులో ఇటీవల ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడికి తామే పాల్పడినట్లు పాక్ ఉగ్రవాద సంస్థలు ప్రకటించుకున్నాయి. ఈ ఘటనలో సుమారు 101 పౌరులు మరణించగా 97 మంది పోలీసులే ఉండటం గమనార్హం. ఈ ఘటనను నిరసిస్తూ పోలీసులు పెషావర్ లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆత్మహుతి దాడిపై విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై పాక్ హోంమంత్రి రానా సనావుల్లా పార్లమెంటులో మాట్లాడుతూ "మనం ముజాహిదీన్ లను సృష్టించాం.. వారే ఇప్పుడు ఉగ్రవాదులు అయ్యారు.." అని పేర్కొన్నారు. ముజాహిదీన్ లను సృష్టించి మనం తప్పు చేశామని ఆవేదన వ్యక్తం చేరశారు. మరో మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ ఉగ్రవాద సంస్థలతో తాము పడుతున్న కష్టాలను ప్రపంచం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రదాడుల కారణంగా పాకిస్థాన్ కు 12వేల 600 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆయన వాపోయారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News