పాకిస్తాన్ స్వాతంత్ర్య సంబరాలు ఆగస్టు 14నే ఎందుకు?

Update: 2020-08-14 13:00 GMT
ఉమ్మడి భారతదేశానికి బ్రిటీష్ వాళ్లు ఆగస్టు 14న రాత్రి 12గంటలు ముగిశాక ఆగస్టు 15వ తేది ప్రారంభమయ్యాక స్వాతంత్ర్యం ప్రకటించారు. అప్పుడు ముస్లింల కోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ దేశం ఏర్పాటైంది. ఈ క్రమంలోనే ఆగస్టు 15నే పాకిస్తాన్ కూడా స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకోవాలి. కానీ ఒక రోజు ముందు ఆగస్టు 14న అది స్వాతంత్ర్య వేడుకలు చేసుకుంటుంది. దానికి ఓ కారణం ఉంది.

ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం భారత్ తోపాటు పాకిస్తాన్ కు 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఆ ఏడాది ఆగస్టు 15న పాకిస్తాన్ పెద్దలు కూడా భారత వేడుకల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో బ్రిటీషర్లు ఆగస్టు 14న అధికార బదిలీ చేశారు.

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. ఆగస్టు 14 పవిత్రమైన రోజు కూడా.. అందుకే రెండేళ్లు ఆగస్టు 15న వేడుకలు చేసుకున్న పాకిస్తాన్.. తరువాత నుంచి 14న సంబరాలు జరుపుకుంటోంది. అలా భారత్ కోసం తో పాటు అదృష్టమైన రోజని పాకిస్తాన్ స్వాతంత్ర్య దినం ఒకరోజు ముందుకు జరిగింది.
Tags:    

Similar News