వన్డే వరల్డ్ కప్... అందులోనూ దాయాదులుగా వినుతికెక్కిన టీమిండియా - పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్. ఇంకేముంది... ఇరు దేశాల క్రికెట్ లవర్స్ తో పాటు వరల్డ్ వైడ్ క్రికెట్ ప్యాన్స్ కు పండుగే. వరల్డ్ కప్ లోనే కాదు... ఎక్కడ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినా... క్రికెట్ లవర్స్ అత్యంత ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఇంగ్లండ్ వేదికగా సాగుతున్న వన్డే వరల్డ్ కప్ లో ఈ నెల 16న దాయాదుల సమయం జరగనుంది. ఈ క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ పాక్ కు చెందిన జాజ్ టీవీ ఛానెల్ టీమిండియాను కించపరిచేలా ఓ వీడియో యాడ్ ను ప్రసారం చేసింది.
ఈ వీడియోలో ఆ ఛానెల్ ఏకంగా పాక్ సైన్యానికి పట్టుబడి ధైర్యంగా వ్యవహరించి తిరిగివచ్చిన వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ ను కించపరుస్తూ వ్యవహచింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. అయితే 16న జరిగే మ్యాచ్ లో పాక్ పై టీమిండియానే విజయం సాధించినట్లుగా - ఆ విజయంతో అభినందన్ కప్ తో వెళ్లిపోతుంటే దానిని లాగేసుకున్నట్లుగా చిత్రీకరించి.. పాక్ టీం సత్తా ఏమిటో కూడా ఆ ఛానెల్ చూపించేసింది.
పాక్ తో పోరులో టీమిండియా భయపడిపోతున్నట్లుగా పాకిస్థాన్ కు చెందిన జాజ్ ఛానెల్ తన పైత్యాన్ని ప్రదర్శించింది. ఈ పైత్యం పాళ్లు ఏ మేర ఉన్నాయంటే.. సదరు వీడియోలో అచ్చుగుద్దినట్లు అభినందన్ లానే కనిపించే ఓ వ్యక్తికి టీమిండియా జెర్సీ వేసింది. టాస్ గెలిస్తే ఏం చేస్తారని సదరు వ్యక్తిని ప్రశ్నిస్తే... ఐయామ్ సారీ - నేనేమీ చెప్పకూడదు అంటూ ఆ వ్యక్తితో చెప్పించారు. చివరలో టీ కప్ తో అతడు వెళుతుంటే... కప్పును ఎక్కడికి తీసుకెళతావంటూ దానిని లాగేసుకుంటారు. ఇదీ ఆ వీడియోలో కనిపించిన దృశ్యాలు.
అంటే... అభినందన్ పాక్ సైన్యానికి పట్టుబడినప్పుడు టీ కప్ తో కనిపిస్తూ.. పాక్ సైన్యం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇప్పుడు అదే ఎపిసోడ్ ను గుర్తు చేస్తూ... పాక్ తో మ్యాచ్ లో తాము పెద్దగా రాణించలేమని వర్ధమాన్ చెబుతున్నట్లుగా తీసిన వీడియోను జాజ్ టీవీ ప్రసారం చేసింది. ఈ వీడియోపై ఇప్పటికే భారత్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అయినా వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియాపై సింగిల్ మ్యాచ్ కూడా గెలవని పాక్ జట్టు సత్తా ఏమిటో కూడా చూపించినట్టుగా అభినందన్ మాదిరి కనిపించిన వ్యక్తి చేతిలోని కప్పును లాగేసుకుని తమ సొంత జట్టు పరువును తీసేసింది.
Full View