అంత ప్రేమ అయితే పాక్ కు పంపిస్తే సరిపోతుందిగా?

Update: 2020-02-21 22:30 GMT
మీ ఇంటికి.. పక్కింటికి మధ్య గొడవలు ఉన్నాయనుకుందాం. పక్కింటోడి తరపున ఇంట్లో మాట్లాడితే ఎలా ఉంటుంది. మీ అమ్మను.. నాన్నను పక్కింటోడు అదే పనిగా తిట్టటమే కాదు.. అవకాశం వస్తే చాలు దాడి చేసేందుకు యత్నించటం.. మీ ఇల్లు సర్వనాశనమై పోవాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు కూడా.. నా ఇల్లు.. నా తల్లిదండ్రులు ఏమైనా ఫర్లేదు.. నా ఫీలింగ్స్ మాత్రమే ముఖ్యమనుకునేటోడు ఆ ఇంటి వాళ్లకు అవసరమా? అలాంటి కొడుకు విషయంలో ఆ తల్లిదండ్రులు ఏలా ఫీల్ అవుతారు? ఒక్కసారి ఆలోచించండి.

ఇంచుమించు అలాంటిదే దేశ ప్రజల్లో కొందరికి పొరుగున ఉన్న పాకిస్థాన్ మీద ఉండే ప్రేమ. అలాంటి ప్రేమ ఉన్నప్పుడు.. పెద్ద మనసుతో.. వారికి నచ్చింది.. వారు మెచ్చింది చేస్తే సరిపోతుంది కదా? ఒక దేశంలోని ప్రజలకు ఏమున్నా లేకున్నా.. దేశం పట్ల అభిమానం చాలా అవసరం. తన దేశానికి హాని చేసేటోడి మీద ఇష్టమే కాదు.. విపరీతమైన ప్రేమ ఉన్నప్పుడు.. ఆ ప్రేమను పది మందికే కాదు.. కోట్లాది మందికి చెప్పాలని తపన పడిపోతుంటే ఏం చేస్తే మంచిది? అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది.

ఇటీవల కాలంలో బాగా చదివినోళ్లు పాక్ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తూ.. బహిరంగంగా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న వారిని.. పెద్ద మనసు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు. ఇలాంటి వారు చేసింది తప్పని.. దేశద్రోహమని పెద్ద పెద్ద శిక్షలు వేసి.. జైల్లో కూర్చోబెట్టటం లో అర్థం లేదు. ఎందుకంటే.. ఈ దేశం మీదా.. ఈ గడ్డ మీద అభిమానం లేనోళ్లకు.. ఈ దేశ ప్రజల కష్టం తో వచ్చే పన్ను ఆదాయంతో పెట్టే తిండి కూడా అనవసరమే అన్నది మర్చిపోకూడదు.

ఇలా చేసే వారిని ఏం చేయాలన్న సందేహం కలుగక మానదు. పొరుగును అంతగా ప్రేమించే వారి గురించి కాస్త దీర్ఘంగా ఆలోచించి.. వారికి నిర్ణీత గడువులోపు దేశం నుంచి వెళ్లిపోవాలన్న ఆదేశంతో పాటు.. వారికున్న దేశ జాతీయతను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దేశంలో ఉండి.. ఆ దేశానికి బద్దశత్రువైన దేశం మీద అంత అభిమానం ఉంటే.. అలాంటోళ్లు దేశంలో ఉండే అర్హతను కోల్పోయినట్లే. అందుకే.. దేశ ద్రోహం లాంటి పెద్ద కేసులు పెట్టి భయపెట్టే కన్నా.. వారికి నచ్చినట్లు.. తోచిన దేశానికి వెళ్లే అవకాశాల్ని కల్పిస్తే చాలామంచిది. ఏమైనా.. దాయాదిని అమితంగా ఆరాధించే వారిని సింఫుల్ గా వదిలేయటం మాత్రం సరికాదు సుమా.



Tags:    

Similar News