దారుణాతి దారుణం జరిగింది. నిజానికి ఇలాంటి దరిద్రాలు మన దేశంలోనే చోటు చేసుకుంటాయంటూ ఆవేశంతో కొందరు గొంతుచించుకుంటారేమో. నిజమే.. ఈ ఉదంతం గురించి విన్న వెంటనే కోపం కట్టలు తెంచుకోవటం ఖాయం. అందుకు కారణమైన కాంగ్రెస్ పార్టీ మీదా.. ఆ పార్టీ అధినేత్రి మీద మరింత ఆగ్రహం వ్యక్తం కావటం ఖాయం. ఇంతకీ అంత దారుణంగా చెబుతున్న ఘటన ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం.
యూపీలోని మొరాదాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ ఒక ర్యాలీ నిర్వహించింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి ప్రాణాలు తీసిన ఉరీ సైనికుల నివాళి కోసం దీన్ని నిర్వహించారు. అయితే.. ఈ ర్యాలీలో పాల్గొన్న కొందరు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయటం షాకింగ్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాల్ని సమాచార్ ప్లస్ అనే వార్తా ఛానల్.. వీడియోతో సహా వార్తను ప్రసారం చేయటంపై కలకలం రేగుతోంది.
యూరీ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కోసం నిర్వహించిన ర్యాలీలో ఇలా శత్రు దేశానికి జిందాబాద్ లు చేస్తున్నా.. అలా నినాదాలు చేస్తున్న వారిని ఎవరూ ఏమీ అనకపోవటం షాకింగ్ గా మారింది. జాతి మొత్తం సిగ్గుపడాల్సిన అంశంగా పలువురు అభివర్ణిస్తున్న ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరింత దారుణానికి పాల్పడిన వారిపై ఆ పార్టీ అధినేత్రి సోనియమ్మ ఏం చర్య తీసుకుంటారు..?
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/