పెళ్లాం కంటే ధోనీయే ఇష్ట‌మ‌ట‌.. ఎవ‌రికో తెలుసా?

Update: 2018-03-10 07:18 GMT
పొగ‌డ్తకు ఎంత శ‌క్తి ఉంటుందో చెప్ప‌టం. మామూలుగా పొగ‌డ‌టం వేరు.. గుండెలోతుల్లో నుంచి వ‌చ్చే పొగ‌డ్త‌కు ఎంత‌టివాడైనా ఫ్లాట్ కావాల్సిందే. తాజాగా ఒక పాక్ అభిమాని చెప్పిన మాట ధోని జీవితంలో మ‌ర్చిపోలేడేమో? ఎందుకంటే.. ధోనీ మీద త‌న‌కున్న అభిప్రాయాన్ని అంత భారీగా పోల్చాడు మ‌రి.

పాకిస్థాన్ అభిమాని మ‌హ్మ‌ద్ బ‌షీర్ అకా అలియాస్ చికాగో చాచాకు ధోనీ అంటే ఎంతో ఇష్టం. ఇత‌గాడు చికాగోలో నివ‌సిస్తుంటాడు. నిద‌హోస్ ట్రోఫీలో భాగంగా శ్రీ‌లంక‌కు వ‌చ్చిన చాచా.. భార‌త వీరాభిమాని సుధీర్.. బంగ్లా అభిమాని షోయ‌బ్ అలీల‌తో క‌లిసి మీడియాలో మాట్లాడాడు. ఈ సంద‌ర్భంగా 2011 ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్ వ‌ర‌కూ ధోనీ అంటే త‌న‌కు ఎవ‌రో తెలీద‌ని.. ఆ త‌ర్వాత అత‌నికి వీరాభిమానిగా మారాన‌ని చెప్పాడు.

త‌న భార్య కంటే ధోనీనే ఎక్కువ ఇష్ట‌మ‌ని వ్యాఖ్యానించాడు. త‌న‌కు ధోనీ ప‌రిచ‌యం ఎలా జ‌రిగింద‌న్న విష‌యాన్ని చెబుతూ.. 2011 ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్ మ్యాచ్ కోసం తాను మోహాలీకి చేరుకున్నాన‌ని.. మ్యాచ్ టికెట్లు లేవ‌ని చెప్పటంతో.. మ్యాచ్ చూడాల‌ని ప్ల‌కార్డు ప‌ట్టుకొన్న‌ట్లు గుర్తు చేసుకున్నారు. అలాంటి వేళ ఒక వ్య‌క్తి క‌వ‌ర్ తీసుకొచ్చి ఇచ్చాడ‌న్నారు. అందులో మ్యాచ్ టికెట్లు ఉన్నాయ‌ని.. వాటిని ధోనీ పంపిన‌ట్లు చెప్పార‌న్నారు. అప్ప‌టికి త‌న‌కు ధోనీ గురించి తెలీద‌న్నారు. ఆ మ్యాచ్ ను తాను చాలా ఎంజాయ్ చేశాన‌ని.. అప్ప‌టి నుంచి త‌న భార్య క‌న్నా ధోనినే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్న‌ట్లు చెప్పారు. అప్ప‌టి నుంచి భార‌త మ్యాచ్ లు చూస్తున్నాన‌న్నాడు.

త‌న‌ను చాలామంది భార‌త్‌ కు ఎక్కువ మ‌ద్ద‌తు ఇస్తావ‌ని అడుగుతార‌ని.. అలాంటివాళ్ల‌కు తాను చెప్పేదొక్క‌టేనంటూ.. "మీరు ఎక్కువ ప్రేమ‌ను భార‌త్ నుంచే పొంద‌గ‌ల‌రు. పాక్ వృద్ధులంతా భార‌త్ శ‌త్రుదేశంగా యువ‌కుల‌కు నూరిపోశారు. ఇది ఏమాత్రం మంచిదికాదు" అని చాచా చెప్ప‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News