పాక్ సైనికులు స్వీట్లు ఇస్తే రిజెక్ట్ చేశారు

Update: 2018-01-26 08:42 GMT
మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా.. స్వాతంత్య్ర దినోత్స‌వం వేళ‌.. గ‌ణ‌తంత్ర‌దినోత్స‌వ వేళ‌.. త‌మ మ‌ధ్య ఉన్న శ‌త్రుత్వాన్ని ప‌క్క‌న పెట్టేసి.. ప‌ర‌స్ప‌రం శుభాకాంక్ష‌లు చెప్పుకోవ‌టం భార‌త్‌.. పాక్ స‌రిహ‌ద్దుల్లో క‌నిపిస్తూ ఉంటుంది. ఈ రెండు రోజుల్లో మాత్ర‌మే కాదు.. జాతీయ దినోత్స‌వాల సంద‌ర్భంగా.. ముఖ్య‌మైన పండ‌గ‌ల వేళ‌లో స‌రిహ‌ద్దుల్లోని రెండు దేశాల‌కు చెందిన సైనికులు స్వీట్లు ఇవ్వ‌టం ఉంటుంది.

తాజాగా ఈ సంప్ర‌దాయాన్ని ప‌క్క‌న పెట్టేశారు భార‌త జ‌వానులు. ఇటీవ‌ల కాలంలో స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్న ఉద్రిక్త‌ల నేప‌థ్యంలో పాక్ తీరుపై త‌మ‌దైన శైలిలో నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు బీఎస్ఎఫ్ జ‌వానులు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా పాక్ రేంజ‌ర్ల‌కు భార‌త సైనిక వ‌ర్గాలు.. ఈసారి తాము ఎలాంటి స్వీట్ల‌ను స్వీక‌రించ‌ద‌న్న విష‌యాన్న ఒక రోజు ముందే పాక్ వ‌ర్గాల‌కు తెలియ‌జేశారు

ఇటీవ‌ల కాలంలో రెచ్చ‌గొట్టేలా కాల్పులు జ‌ర‌ప‌టం.. క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టం ద్వారా.. ప్రాణ.. ఆస్తి న‌ష్టానికి గురి చేస్తున్న పాక్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన భారత సైనికులు ప్ర‌తి ఏటా పాక్ వ‌ర్గాలు ఇచ్చే మిఠాయిలు తీసుకోమ‌న్న విష‌యాన్ని చెప్పారు. దీంతో.. సుదీర్ఘ‌కాలంగా సాగుతున్న సంప్ర‌దాయానికి బ్రేక్ ప‌డిన‌ట్లైంది. అదే స‌మ‌యంలో.. పాక్ తీరుపై త‌మ ఆగ్ర‌హాన్ని.. నిర‌స‌న‌ను బీఎస్ఎఫ్ జ‌వాన్లు వినూత్నంగా చెప్పిన‌ట్లైంది.
Tags:    

Similar News