తమిళనాట అమ్మ జయలలిత మరణం తర్వాత సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. శశికళ వల్ల ఫళనిస్వామి సీఎం కుర్చీలో కూర్చోగా.. అమ్మ నమ్మిన బంటు పన్నీరు డిప్యూటీ సీఎంగా నియామకమయ్యారు.
అయితే అన్నాడీఎంకేలో సీఎం వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. గ్రూపుల వార్ మొదలైంది. 2021 ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి అంటూ మంత్రులు సెల్లూరు రాజు, కేటీ రాజేంద్ర బాలాజీల భిన్న వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే..
ఇది కాస్త సీఎం ఫళిని, డిప్యూటీ సీఎం పన్నీరు శిబిరాల మధ్య చిచ్చుకు దారితీసింది. దీంతో దిండుగల్ జిల్లాలో సీఎం పన్నీరు, డిప్యూటీ సీఎం గా ఫళని అంటూ పోస్టర్లు వెలియడం మరోసారి అధికార పార్టీలో కలకలం రేపాయి.
ఈ నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం శిబిరాల మధ్య వివాదం పీక్ స్టేజీకి చేరింది. సీఎం ఎవరో చర్చను మరోమారు తెరపైకి తెచ్చింది. ఇప్పుడు డిండిగల్ లో వెలిసిన పోస్టర్లు సంచలనమయ్యాయి.