నిజంగా నిజం.. ఆ బ్లడ్ గ్రూపు వారిని కరోనా ఏం చేయడం లేదు. వారికి ఎక్కువగా సోకడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడ్డ వారిని పరిశోధించి మరీ చెప్పిన నిజం ఇదీ..
ప్రపంచ దేశాల ప్రజలను పట్టుకున్న కరోనా మహమ్మారి గురించి ఇప్పుడు ఒక కీలక విషయం మరోసారి కన్ఫమ్ చేసింది. ఇంతకుముందు చాలా సర్వేల్లో చెప్పారు. ఇప్పుడు ఇంకా క్లియర్ గా ఎక్కువ మంది శాంపిల్స్ సేకరించి మరీ చేసిన సర్వేలో సంచలన నిజం నిగ్గుతేల్చారు. బ్రిటీష్ కొలంబియా యూనివర్సిటీ, డెన్మార్క్ లోని ఓడెన్స్ యూనివర్సిటీ హాస్పిటల్ పరిశోధకులు వేర్వేరుగా జరిపిన రెండు తాజా అధ్యయనాల్లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
‘ఓ’ పాజిటివ్ లేదా నెగటివ్ బ్లడ్ గ్రూప్ కలిగిన ప్రజలపై కరోనా వైరస్ అంతగా ప్రభావం చూపడం లేదని.. వారిలో వైరస్ కారణంగా శరీర అవయవాలు చెడిపోవడం.. మృత్యువాత పడడం చాలా తక్కువ అని ఓడెన్స్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
వైరస్ బారిన పడుతున్న ప్రజలలో ‘ఓ’ బ్లడ్ గ్రూపు ప్రజలు తక్కువగా ఉన్నారని.. ఏ, బీ, ఏబీ బ్లడ్ గ్రూపుల వారే ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడుతున్నారని డానిష్ పరిశోధకులు కనిపెట్టారు.
ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల మంది కరోనా బాధితుల నుంచి 4,73,000 మంది కరోనా కేసులపై అధ్యయనం జరిపారు. ఓ, బీ బ్లడ్ గ్రూపుల వారికన్నా ఏ, ఏబీ బ్లడ్ గ్రూపుల వారే ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడుతున్నారని తేలింది. ముఖ్యంగా ఏ, ఏబీ గ్రూపులపైనే వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని బ్రిటీష్ కొలంబియా యూనివర్సిటీ పరిశోధనలో బయటపడింది. ఈ అధ్యయనంలో ఏకంగా 62శాతం మంది ఏ, బీ, లేదా ఏబీ బ్లడ్ గ్రూప్ వారే ఉన్నారు. కేవలం 38శాతం మంది మాత్రమే ఓ బ్లడ్ గ్రూపు వారు ఉండడం విశేషం.