కోవిడ్​ వైరల్​ ఇన్​ఫెక్షన్​ కాదా? ఆటో ఇమ్యూన్​ రోగమా? కొత్తపరిశోధనలో విస్తుపోయే నిజాలు!

Update: 2020-12-13 02:30 GMT
కరోనా వైరల్​ ఇన్​ఫెక్షన్​ అని ఇంతకాలం డాక్టర్లు చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం కరోనా అనేది వైరస్​తో రావడం లేదని అది ఆటో ఇమ్యూన్​ డిసీజ్​ అని కొందరు వైద్యనిపుణులు అంటున్నారు. అసలు ఆటో ఇమ్యూన్​ డిసీజ్​ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతి వ్యక్తి శరీరంలోనూ ఇమ్యూనిటీ ఉంటుంది. శరీరంలోకి ఇతర వైరస్​లు వచ్చినప్పుడు ఆ యాంటీబాడీలు స్పందించి వాటిని చంపేస్తాయి.

అయితే ఒక్కోసారి శరీరంలోకి ఇతర వైరస్​లు రాకపోయనప్పటికి మనశరీరంలోని అవయవాలనే బయటి కణాలుగా భావించి యాంటీబాడీస్​ దాడిచేస్తుంటాయి. దీన్నే ఆటో ఇమ్యూన్​ డిసీజ్​ అంటారు. ఆటో ఇమ్యూన్​ డిసీజ్​లు వచ్చినప్పుడు శరీరంలోని కొన్ని అవయవాలు వాపుకు గురవుతాయి. ప్రస్తుతం కరోనా పేషెంట్లలోనూ ఇటువంటి గుణమే కనిపిస్తుందట. దీంతో చాలామంది కరోనాను కూడా ఆటో ఇమ్యూన్​ డిసీజ్​ అని భావిస్తున్నారు. ఈ మేరకు జమా కార్డియాలజీ జర్నల్‌లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. కరోనా బాధితుల్లోని 60శాతం మందికి ఆటో ఇమ్యూన్​ డిసీజ్​ వచ్చినట్టు ఇందులో ప్రచురించారు.

శరీరంలోకి ప్రవేశించిన కరోనా వైరస్‌ గుండె కండరాల్లో ఏదో సమస్య ఉందని రోగనిరోధక వ్యవస్థ భావించేలా చేస్తోందని, తద్వారా ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమవుతోందని తాము భావిస్తున్నట్టు స్వార్ట్జ్‌బర్గ్‌ వివరించారు. మరికొందరు శాస్త్రజ్ఞులు మాత్రం కరోనా వైరస్‌ మన రోగనిరోధక వ్యవస్థను గుండె కండరాలపై, మెదడుపై దాడి చేసేలా ప్రేరేపిస్తోందంటున్నారు. దీనిపైనే పరిశోధనలను కొనసాగిస్తే బాధితుల ప్రాణాలను కాపాడవచ్చని వారు వివరిస్తున్నారు.
Tags:    

Similar News