సోషల్ మీడియా లో పానీపూరీ రచ్చ అసలేమైంది?

Update: 2021-04-03 10:48 GMT
పానీపూరీ .. భారతదేశంలో చాలా పాపులర్ స్ట్రీట్ ఫుడ్ ఇది. అన్నా .. ఓ పది రూపాయల పానీపూరీ పెట్టు అని ప్లేట్ పట్టుకుంటాం. ఇన్ని ఉల్లిపాయ ముక్కలు ప్లేట్ లో వేసుకొని , పూరీలో ఇంత చాట్ వేసి , ఓ రకమైన పానీయంలో ముంచి ప్లేట్ లో పెడతాడు. దాంట్లో కొన్ని ఆనియన్స్ ముక్కలేసుకొని నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది పానీపూరి. పానీపూరి అమ్మే వ్యక్తి  టకా టకా ప్లేట్ లో పానీపూరీ వేస్తూనే ఉంటాడు. మనం తింటూనే ఉంటాం. అలా ఎన్ని వేసినా తింటూనే ఉంటాం. అంతలా నోరూరిస్తుంది పానీపూరీ. చిన్నపిల్లల దగ్గర్నుంచి పండు ముసలి వరకు పానీపూరీ అనగానే నోరూరాల్సిందే. పానీపూరీని సౌత్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో గప్ చుప్ అని కూడా పిలుస్తారు. నార్త్ ఇండియాలో మాత్రం గోల్ గప్పా అని పిలుస్తారు.

కానీ ప్రస్తుతం ఈ పానీపూరీయే ట్విటర్‌ లో కొత్త రచ్చకు దారీ తీసింది.  ఈ అంశంపై నెటిజన్లు రెండుగా విడిపోయారు. కాగా, ట్విటర్‌లో ఓ నెటిజన్‌ గోల్ ‌గప్పే, పానీపూరి ఒకటి కాదని చర్చకు తెరలేపింది. ట్విటర్‌ లో ఓ ఫొటోనూ షేర్‌ చేసింది. ఈ ఫోటోలో గోల్‌ గప్పేకు సూచకంగా అసలైన పానీపూరీ ఫోటో పెట్టగా.. పానీపురీ అంటే గ్లాసులో నీరు ఆ పక్కనే పూరి ఉన్న ఫోటోను ఉంచింది. దీనితో కొంత మంది నెటిజన్లు ఈ ట్వీట్ పై ఆగ్రహానికి గురైయ్యారు. ప్రాంతాలను బట్టి తినే ఆహార పదార్ధాల పేర్లు మారుతుంటాయి. రకరకాల పేర్లతో పిలుస్తారు. అసలు అందులో తప్పేముంది. అందరూ దాన్ని ఇష్టంగానే ఆస్వాదిస్తాం అని ఓ నెటిజన్‌ కౌంటర్‌ ఇచ్చాడు.  ప్రస్తుతం పానీపూరి వార్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

https://twitter.com/glorygirllllll/status/1376541648402923525?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1376611686711357443|twgr^|twcon^s2_&ref_url=https://www.sakshi.com/telugu-news/social-media/gol-gappe-vs-pani-puri-tweet-street-snack-leaves-tweeple-divided-1354355
Tags:    

Similar News