దేశంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా ప్రధాని నరేంద్రమోడీకి పేరుంది. విపరీతమైన ప్రజాకర్షణ.. అంతకు మించి మాటలతో ప్రజల మనసుల్ని దోచేసే మోడీని విమర్శించే వారు.. తప్పు పట్టే వారు పెద్దగా కనిపించదు. ఎన్నికల వేళ.. విపక్షాలు సైతం ఆయనపై తీవ్రంగా విరుచుకుపడలేని పరిస్థితి. రాహుల్..మమత.. చంద్రబాబు లాంటి కొద్దిమంది తప్పించి ఆయనపై ఫైర్ అయ్యేవారు తక్కువే.
విపక్షాల పరిస్థితే ఇలా ఉంటే.. సొంత పార్టీలో మోడీకి దాదాపు తిరుగులేనట్లే. అప్పుడప్పుడు విమర్శలు చేసే నేతలు ఎవరైనా ఉన్నారంటే అది సుబ్రమణ్య స్వామి.. సినీ నటుడు శత్రుఘ్న సిన్హా లాంటి కొందరే కనిపిస్తారు. మోడీ మీద విమర్శలు చేసే విషయంలో ఎప్పుడూ వెనుకాడని వీరిలో.. శత్రుఘ్న సిన్హా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరటం.. అప్పటి నుంచి మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం ఎక్కువైంది.
ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగుతున్న వేళ.. షాట్ గన్ మరోసారి తన నోటికి పని పెట్టారు. మోడీని విమర్శిస్తూ ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యన జరిగిన మధ్యప్రదేశ్.. రాజస్థాన్.. ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ ఘన విజయం సాధించటంతోనే ఎవరు పప్పు.. ఎవరు ఫేకూ (అబద్ధాల కోరు) అన్న విషయం తేలిపోయినట్లు చెప్పారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పప్పుగా బీజేపీ వర్గాలు అభివర్ణిస్తుంటే.. మోడీని ఫేకూ (మోసగాడు)గా రాహుల్ తో సహా పలువురు కాంగ్రెస్ నేతలు తప్పు పడుతున్నారు. తప్పుడు వాగ్దానాలు ఇవ్వటంలో మోడీకి మోడీనే సాటి అని చెప్పిన ఆయన.. 2022.. 2024..2029లోనూ మోడీ అబద్దాలే ఆడుతుంటారని.. అప్పుడు కూడా ఆయన ప్రధాని కాలేరన్నారు.
పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో పాటు.. జీఎస్టీని అమలు చేయటం వల్ల పెద్ద ఎత్తున యువకులు ఉద్యోగాలు కోల్పోయినట్లుగా ఆయన మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు.. రాఫెల్.. జీఎస్టీ తదితర ముఖ్యమైన విషయాల్లో పార్టీలోని ఎవరితోనూ మాట్లాడకుండానే తనకు తానుగా నిర్ణయాలు తీసుకున్నారని.. ఈ కారణంతోనే తాను పార్టీని విడిచి పెట్టి బయటకు వచ్చేసినట్లుగా వెల్లడించారు. కీలకమైన ఎన్నికల వేళ బీజేపీకి గుడ్ బై చెప్పేసి.. కాంగ్రెస్ లోకి చేరిన షాట్ గన్ ను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. డేరింగ్.. డ్యాషింగ్.. ఛార్మింగ్ నేతగా పొగిడేశారు. మోడీ మరోసారి ప్రధాని కావటం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని చెబుతున్నారు. మరి.. ఆయన మాటల్లో నిజం ఎంతన్నది తేలాలంటే మే 23 వరకూ వెయిట్ చేయాల్సిందే.