భారత్ వెలిగిపోతుందని.. దూసుకెళుతుందన్న మాటను బీజేపీ నేతలు తరచూ చెబుతుంటారు. ప్రధాని మోడీ నాయకత్వంతో భారత్ ఆర్థిక పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందని.. గతంలో పోలిస్తే.. ఎప్పుడూ లేనంత బలోపేతమైనట్లుగా చెబుతుంటారు. ఈ గొప్పలు ఇలా ఉంటే.. దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుందని.. పరిస్థితి ఇబ్బందికరంగా ఉందన్న పెదవి విరుపు వినిపిస్తోంది. అయితే.. మాంద్యం ఇబ్బంది ఎంతలా ఉందన్న విషయాన్ని నిరూపించే అంకెల్ని విపక్షాలు చూపించని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. ఇటీవల ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో భారత్ ఆర్థిక వృద్ధి అనుకున్నంతగా లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. వార్షిక వృద్ధి రేటు ఆరు దాటని దుస్థితి. ఇదిలా ఉంటే.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్ భర్త కమ్ తెలుగువారికి సుపరిచితులు.. మేధావిగా పేరున్న పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం తీవ్ర ఆర్థికమాంద్యంలో చిక్కకుందని.. వాస్తవాల్ని కేంద్రం అంగీకరించటం లేదన్న మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
మోడీ సర్కారుతో పోలిస్తే.. గతంలో పాలించిన మన్మోహన్.. పీవీ ఆర్థిక విధానాలే బాగుండేవని పొగిడేయటం విశేషం. వృద్ధి రేటును పరుగులు పెట్టేందుకు కార్పొరేట్ ట్యాక్స్ ను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటికీ.. అనుకున్నంత వేగం ఆర్థిక వ్యవస్థలో లేదన్న మాట వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా పలు అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి రేటును తగ్గిస్తూ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి వేళ.. పరకాల ప్రభాకర్ దేశ ఆర్థిక పరిస్థితి మీద పెదవి విరవటమే కాదు.. నిరుత్సాహంగా ఉందన్న విషయాన్ని గత పాలకుల్ని ప్రస్తావించి మరీ చెప్పటం సంచలనంగా మారింది. ఆర్థికమంత్రి భర్తే తన పాలన మీద పెదవి విరిచిన వైనంపై ప్రధాని మోడీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.