ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేసిన వైనం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని సృష్టిస్తోంది. పరకాల ప్రభాకర్ భార్య నిర్మలా సీతారామన్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఎన్డీయేకు గుడ్ బై చెప్పిన తర్వాత కూడా...నిర్మలా సీతారామన్ కేంద్రమంత్రిగా ఉండటంతో పరకాల ప్రభాకర్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సలహాదారుగా కొనసాగించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తమపై బీజేపీతో దోస్తీ అనే ఆరోపణలు చేసే ముందు పరకాల ప్రభాకర్ సంగతేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ పరిణామాల అనంతరం పరకాల రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను చంద్రబాబుకి పంపిస్తూ.. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని బాబును ఆయన కోరారు.
వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయని.. అందుకే మీడియా సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రభాకర్ ప్రకటించారు. విపక్షానికి చెందిన కొంతమంది లీడర్లు తాను ప్రభుత్వంలో సలహాదారు బాధ్యతలో ఉండడాన్ని పదేపదే ఎత్తిచూపడంతోనే.. రాజీనామా చేసినట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. సహజంగానే ఈ విమర్శల ఆధారంగా అధికార తెలుగుదేశం పార్టీ వైసీపీపై విమర్శలు చేస్తోంది. తమ సర్కారుపై ప్రతిపక్ష నేత అడ్డగోలు విమర్శలు చేసినందుకు పదవిని వీడారని పేర్కొంటోంది. తనపై వచ్చే విమర్శలకు టీడీపీ పరకాల ఉదంతం ప్రస్తావించడం బాగానే ఉంది కానీ...మిగతా వాటిని ఎందుకు ప్రస్తావించడం లేదని పలువురు పేర్కొంటున్నారు.
కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో మహారాష్ట్ర బీజేపీ మంత్రి సతీమణికి బోర్డు సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. ఈ విషయంలో పలువురు ప్రస్తావించగా...ఇది ముఖ్యమంత్రి నిర్ణయమని ఈ విషయంలో విమర్శలు సరికాదని చిత్రమైన లాజిక్ లాగారు. ఈ నియామకం రద్దు చేస్తారా అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మరోవైపు గడువు ఇంకో 20 రోజుల్లో ముగుస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో తన రాజీనామాకు వైసీపీ విమర్శలకు ముడిపెట్టడం - మరోవైపు...బీజేపీ మనుషులను తాము దూరం పెడుతున్నట్లు టీడీపీ నేతలు ప్రకటించుకోవడం చిత్రంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.