గజ్జి బ్యాచ్ కి ఇవాల్టి డోస్ అంటూ అస్సలు తగ్గని పరకాల

Update: 2021-08-07 11:31 GMT
ఏమైందో ఏమో కానీ పరకాల ప్రభాకర్ అస్సలు తగ్గట్లేదు. ఆ మాటకు వస్తే మెగా అభిమానులకు సైతంఅర్థం కాని రీతిలో విరుచుకుపడుతున్న ఆయన ఆశ్చర్యంగా మారింది. ఆసక్తికరంగా తమ బాస్ ను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు వదిలిపెట్టని పవన్ సైతం.. పరకాల తిట్లకు భారీగా సీరియస్ అయినా.. ఆ తర్వాత ఎందుకో తగ్గటం కనిపిస్తోంది. ఇదే విషయాన్ని పరకాల కూడా ప్రస్తావించటం గమనార్హం. తాజాగా పెట్టిన ట్వీట్ దీనికి నిదర్శనంగా చెప్పాలి.

‘గజ్జి బ్యాచ్ కి నిన్నటి ప్రశ్నలు చాలా కష్టంగా ఉన్నట్టున్నాయి. సమాధానాలు చెప్పలేక నేత టికెట్ - ఈల బ్యాచ్ బాబాయ్ లు పిన్నిలు బూతుపురాణం ఎత్తుకున్నారు. సరే మరి.. ఇవాళ కొంచెం వీజీ కొచ్చెన్ (క్వశ్చన్) అడుగుతాను. చింపుల్ (సింఫుల్).. పాలకొల్లు.. రైలింజను.. ఈ రెండు మాటలు వింటే ఏమనిపిస్తుంది? జస్ట్ ఒకటి రెండు వ్యాక్యాలు చెప్పండి చాలు. మొన్నటి మీద నిన్న జోరు బాగా తగ్గింది. చాలా కుక్కలు తోకముడిచాయి. నీరసం మొదలయ్యిందా? మొన్నటి దానికి 385 కామెంట్లు.. తిట్లు పెట్టిన వాళ్లు నిన్నటిదానికి 325కి పడిపోయారు ఏంటి కత? కిరాయి మరీ చీప్ లిక్కర్ లెవెల్ కి దించేసినట్టుంది హెడ్ క్వార్టర్సు. ఇవాళిచ్చిన ప్రశ్నకు జవాబు ట్రై చేయండి. కొంచెం పెంచుతారేమో? మళ్లీ రేపు పనులు ముగించుకుని తీరుబాటు అయ్యాక తిరిగి వచచి ఇంకా మిగిలి ఉన్న గజ్జి కుక్కల పళ్ళూడగొడతాను. సీయూ’’ అంటూ భారీ పోస్టు పోస్టు చేశారు. దీనికి క్యాప్షన్ గా.. ‘ఇంకా ఇక్కడికక్కడే తిరుగుతున్న గజ్జి బ్యాచ్ కి.. ఇవాల్టిడోస్’ అంటూ విరుచుకుపడిన ఆయన తాజాగా మరో ట్వీట్ తో మరింతగా గిల్లాడని చెప్పాలి.

తాను అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పలేదంటూ విరుచుకుపడిపోయి.. మరో భారీ పోస్టు పెట్టిన పరకాల వారి తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఇంకా.. ఆ మూలా.. ఈ మూలా తచ్చాడుతున్న పిత్తపరిగి సైన్యానికి అంటూ ఆయన పెట్టిన పోస్టును యథాతధంగా చూస్తే..

‘‘నిన్నటి చింపుల్ (సింపుల్) కొచ్చెన్ కి కూడా జవాబు ఇవ్వలేకపోయిన గజ్జి బ్యాచ్. అసహనంతో ‘పూ’ గుణింతపు బూతు పురాణం లంకించుకున్న నేత టికెట్ -ఈల బ్యాచ్. రోజురోజుకూ నీరసిస్తున్న పిత్తపరిగి సైన్యం. మొదటి రోజున 385.. రెండో రోజున 325.. ఇవాళ మూడో రోజున మరీ ఘోరంగా 154కు పడిపోయిన తిట్లు.. శాపనార్థాలు.. ట్వీట్లు. వెన కాళ్ల మధ్య తోకలు దోపుకొని పరుగులు తీస్తున్న గజ్జికుక్కల బ్యాచ్. ఆఫీసులో ఇస్తున్న ట్వీట్ కి పావలా రేటు పట్ల ఈల బ్యాచ్ అసంత్రప్తి. పోనీ ఇవాళ ఇంకా వీజీ కొచ్చెన్ ఇస్తాను. ట్రై చేయండి. రేపటికి రేటు ఏమైనా కిట్టుబాటు అవుతుందేమో చూడండి’

‘బీవారం గిలాసు.. ఈ మాటలు విని ఈ ఖాళీలను పూర్తి చేయండి.. ఛళ్ళుమంది,  గుయ్యిమంది,  --- పగిలింది (ఎవరినైనా అడిగి కూడా పూర్తి చేయవచ్చు) సో.. రేపు పనులు ముగించుకొని తీరికయ్యాక ఇంకా మిగిలి ఉన్న గజ్జి బ్యాచ్ కి బడితి పూజ.. సీయూ.. ’ అంటూ పోస్టు పెట్టేశారు. ఇలా రోజుకు ఒకటి చొప్పున పోస్టులు పెడుతున్న పరకాల టార్గెట్ మొత్తం పవన్ కల్యాణ్ అభిమానులేనన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు.. అందులో.. ఈ ఎపిసోడ్ లో తాను పెడుతున్న చివరి ట్వీట్ గా ఆయన చెప్పకనే చెప్పేశారు. ‘పాపం అక్కడక్కడా మూలుగుతూ పడి ఉన్న పిత్తపరిగి సైన్యానికి.. ఈ సీసన్ (సీజన్)చివరి డోస్.. మళ్లీ ఈ ఛాయలకొచ్చారో .. ఖబడ్డార్’ అంటూ వార్నింగ్ ఇచ్చేశారు. ఇక.. ఆయన పోస్టు చేసిన ట్వీట్ లోని విషయంలోకి వెళితే..

‘‘నేల టికెట్ ఈల బ్యాచ్ బాబాయ్ లూ పిన్నిలూ.. ఏంటి కత? తిట్లు.. శాపనార్థాలు మరీ ఇంత దారుణంగా పడిపోయాయా? నిన్నటి డోస్ కి 48కి మించలేదేంటి మొరుగుళ్ళు? తిట్టుకి బేడ డబ్బులు కూడా ముట్టట్లేదా? అయ్యో? 1-2-3-4- 10 పేద్ద పోటుగాళ్ళమంటూ బయల్దేరిన గజ్జి కుక్కలు నేను బాదిన బాదుడికి కిందపడి.. పది లెక్క పెట్టినా లేవడం లేదు. తగిలిన దెబ్బలకు ఓర్చుకోలేక పోతున్నాయి. పాపం మూలుగుతున్నాయి. చాల్లే మరి.. ఈ నాలుగు రోజులు మొరిగిన మొరుగుడు. పిత్తపరిగి పోలిగాడు.. దాక మోహం సోంబేరిగాళ్ళ ఈల బ్యాచ్ కి ఇంతకన్నా డోెసు అవసరం లేదులే. ఇప్పటికి సరిపెడతాను. ఇంకోసారి ఎప్పుడైనా ఈ గజ్జి కుక్కలు ఈ ఛాయలకి వచ్చి తోకాడించాయా.. మళ్లీ అప్పుడొచ్చి ఇరగ తంతాను. సరేగానీ పిత్తపరిగి పోలిగాడు.. దాక మొహం సోంబేరిగాడు ఎవరా అని పిసుక్కోకండి.. వీజీయే తెల్సుకోడం.. సీయూ’’ అంటూ ముగించారు. జనసైనికుల్ని.. పవన్ ఫ్యాన్స్ ను ఇంతలా టార్గెట్ చేసిన పరకాల తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతలా విరుచుకుపడుతున్న దానికి అసలుకారణం ఏమిటన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. మరీ.. గుట్టును పరకాల వారు ఎప్పుడు రివీల్ చేస్తారో..?
Tags:    

Similar News