ప్రస్తుతం ఈ సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే ..ఇలాంటి వారి మధ్య జీవిస్తున్నామా అని అనిపిస్తుంటుంది. ప్రతి రోజు ఈ ప్రపంచంలో జరిగే ఎన్నో ఘోరాల గురించి మనం తెలుసుకుంటూనే ఉంటాం. తాజాగా మరో ఘోరం వెలుగుచూసింది. నవమాసాలు మోసి, కని, పెంచి .. పెద్ద చేసిన తల్లి భారమైంది అని బతికుండగానే ఆమెను పాతిపెట్టి హత్యాయత్నానికి ప్రారంభించాడో దుర్మార్గపు కొడుకు. మూడు రోజుల తర్వాత ఆమెను బయటకు తీసి రక్షించిన ఘటన ఉత్తర చైనాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైనాకు చెందిన యాన్ అనే వ్యక్తి తల్లి వాంగ్ పాక్షిక పక్షవాతంతో బాధపడుతోంది. దీనితో ఆమె మంచానికే పరిమితం అయింది. ఆ కారణంగా ఆమెకు సపర్యలు చేస్తూ, సంరక్షణ చూసుకోవడం భారంగా భావించాడు. దీంతో అతను తన తల్లిని ఎలాగైనా కూడా హతమార్చాలని పన్నాగం పన్నాడు. అందులో భాగంగా మే రెండో తారీఖున చక్రాలబండిలో ఆమెను బయటకు తీసుకెళ్లాడు. అయితే ఆ రోజే కాకుండా మూడు రోజులు గడుస్తున్నా ఆమె ఇంటికి రాలేదు. దానితో అనుమానం వచ్చిన అతని భార్య ఈ విషయాన్ని పోలీసులకు చేరవేసింది.
దీనితో వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ఘోరమైన విషయం బయటపడింది. తల్లిని చూసుకోవడం తన వల్ల కాదని అందుకే ఆమెను బతికుండగానే పాతిపెట్టినట్టు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు హుటాహుటిన పాతిపెట్టిన స్థలానికి వెళ్లగా అంతటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ సమాధిలో నుంచి ఆమె నీరసంగా సహాయం కోసం అర్థించడం వినిపించింది. వెంటనే పోలీసులు ఆ ప్రదేశాన్ని తవ్వి ఆమెను రక్షించారు. శరీరమంతా మట్టికొట్టుకుపోయి, కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.