దేశంలో సుపంన్నుడు.. లక్షల కోట్లకు అధిపతి అయిన ముకేశ్ అంబానీ ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు హుటాహుటిన వచ్చి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలిశాడు. తన మిత్రుడు పరిమల్ నత్వానీకి రాజ్యసభ సీటు కోసం విజ్ఞప్తి చేశాడు. కుటుంబ సమేతంగా పరిమల్ నత్వానీతో వచ్చి కోరడంతో జగన్ తన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సీటు ఇచ్చారు. పరిమల్ నత్వానీని ఆంధ్రప్రదేశ్ కోటా కింద రాజ్యసభకు పంపారు. ఆయన పేరును మరో ముగ్గురితో కలిసి ప్రకటించింది. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పరిమల్ నత్వానీ వాలిపోయారు. గుళ్లుగోపురాలు తిరిగి జగన్‌కు కృతజ్ఞతలు చెప్పేసి ఆయన వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో కనిపించలేదు.
అయితే ప్రస్తుతం దేశంతోపాటు ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. పెద్ద సంఖ్యలో అనుమానితులు కనిపిస్తున్నారు. ఇక దేశ, విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో అరకొర వైద్య సదుపాయాలు ఉన్నాయి. కరోనా చికిత్సకు కావాల్సిన పరికరాలు, సౌకర్యాలు లేవు. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాయి. పైగా లాక్‌డౌన్ తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నది. ముందే లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి కరోనాతో తీవ్రంగా నష్టం ఏర్పడింది.
ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాల్సిన సమయం ఏర్పడింది. ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వస్తున్నాయి. అయితే పెద్ద సంఖ్యలో మాత్రం రావడం లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలవడం, కరోనా బాధితులకు వైద్యం అందడం కష్టంగా మారిన సమయంలో దాతలు స్పందించాల్సి ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లిన పరిమల్ నత్వానీ ఇప్పటి వరకు స్పందించ లేదు. రాష్ట్రానికి ఎంతో కొంత ఆర్థిక సహాయం ప్రకటించలేదు. దేశంలోనే సంపన్నుడు.. ప్రముఖ వ్యాపారవేత్తగా కొనసాగుతున్న నత్వానీ ఆంధ్రప్రదేశ్ కు సహాయం చేయక పోవడంతో చర్చనీయాంశమైంది.
రాష్ట్రానికి కష్టమొచ్చిన సమయంలో అండగా ఆయన నిలవరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇంతవరకు ప్రకటించలేదు. దేశంలో లాక్‌డౌన్ విధించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి. ఆర్థిక వ్యవహారాలన్నీ నిలిచిపోయాయి. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లిన పరిమల్ నత్వానీ ఎందుకు స్పందించడం లేదని అందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ముకేశ్ అంబానీ తన సొంత ఖర్చుతో మహారాష్ట్రలో కరోనా నివారణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక చర్యలు తీసుకుని అండగా నిలబడ్డారు. అయితే పరిమల్ నత్వానీ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నా స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాజ్యసభ కు పంపిస్తే ఆంధ్రప్రదేశ్ కు పంగనామం పెట్టావా అని పలువురు విమర్శిస్తున్నారు. అయితే త్వరలోనే పరిమల్ నత్వానీ కొంత సహాయం చేసే అవకాశం ఉందని సమాచారం.