శ్రీరాముడిపై కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేయటం.. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలపై స్వామి పరిపూర్ణానంద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. కత్తి మహేశ్ వ్యాఖ్యలపై తాను నిరసన యాత్ర చేయనున్నట్లు ప్రకటించి.. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకూ తన యాత్ర ఉంటుందని ప్రకటించారు.
వాస్తవానికి ఈ యాత్రకు పోలీసుల నుంచి క్లియరెన్స్ కూడా వచ్చింది. అయితే.. ఈ యాత్ర కారణంగా శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న వాదన తెర మీదకు వచ్చింది. దీంతో.. స్వామికి ఇచ్చిన అనుమతిని రద్దు చేశారు. మరోవైపు శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్ పై హైదరాబాద్ నగర బహిష్కరణ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ను హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో ఏపీకి తరలిస్తామని చెబుతూనే.. కర్ణాటకలో విడిచి పెట్టారు.
కత్తిపై నగర బహిష్కరణ వేటు వేసిన వేళలోనే..నిరసన యాత్ర చేపడతానని చెప్పిన స్వామి పరిపూర్ణనందను హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం బుధవారం తెల్లవారుజాము ప్రాంతంలో ప్రత్యేక వాహనంలో ఆయన్ను హైదరాబాద్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తరలించారు.
కత్తి మీద మాదిరే స్వామి మీద కూడా హైదరాబాద్ నగర బహిష్కరణ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో పరిపూర్ణనంద స్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను రోడ్డు మార్గంలో తరలించారు. ఎక్కడికి తీసుకెళుతున్నారన్న విషయంపై క్లారిటీ ఇవ్వని అధికారులు బుధవారం రాత్రికి కాకినాడలోని శ్రీపీఠానికి చేర్చారు. షెడ్యూల్ ప్రకారమే అయితే బుధవారం మధ్యాహ్నానానికే కాకినాడకు తీసుకెళ్లాల్సి ఉంది.
అయితే.. మీడియాతో పాటు ప్రజల దృష్టిని మరల్చేందుకు.. బావోద్వేగాలకు బ్రేకులు వేసేందుకు వీలుగా కాకినాడకు రాత్రికి చేరేలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఆలస్యంగా కాకినాడకు స్వామి చేరుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కత్తి మహేశ్.. పరిపూర్ణానంద స్వామిలను నగర బహిష్కరణ చేపటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.