చ‌మ‌న్ క‌న్నుమూత‌..ప‌రిటాల కుటుంబంలో విషాదం

Update: 2018-05-07 09:53 GMT
ఓ వైపు ప‌రిటాల ఇంట శుభకార్యం జ‌రుగుతుంటే అదే స‌మ‌యంలో వారి కుటుంబం దిగ్భ్రాంతికి లోన‌య్యే ఘ‌ట‌న చోటుచేసుకుంది. దివంగత టీడీపీ నేత - మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు చమన్ కన్నుమూశారు. పరిటాల రవీంద్ర కుమార్తె పరిటాల స్నేహలత వివాహ వేడుక కోసం పర్యవేక్షణ కోసం మూడు రోజులుగా వెంకటాపురంలోనే ఉన్న చమన్‌కు సోమవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ర‌వి స‌హా చ‌మ‌న్ కుటుంబ స‌భ్యులు ఆయన్ను కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా, ఈ ప‌రిణామంతో ఇటు చ‌మ‌న్ అటు ప‌రిటాల కుటుంబంలో విషాద చాయ‌లు అలుముకున్నాయి.

ఫ్యాక్ష‌న్ హ‌త్య‌ల్లో భాగంగా పరిటాల హత్య జ‌రిగిన తరువాత చాలాకాలం పాటు ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. 2012 సంవత్సరంలో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు 2014లో  అజ్ఞాతాన్ని వీడి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి.. జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. అనంతరం జిల్లాపరిషత్ ఛైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టి 2017 వరకు ఆ పదవిలో కొనసాగారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాతే చురుగ్గా రాజ‌కీయాల్లో పాల్గొన్నారు.  ప‌ద‌వి పంప‌కాల్లో భాగంగా ఆయ‌న మ‌రో నేత‌కు ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించారు, చమన్ మృతి విషయం తెలుసుకున్న టీడీపీ అభిమానులు - రవి అనుచరులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు.. మంత్రి పరిటాల సునీత కొద్దిసేపటి క్రితం అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయన భౌతికకాయాన్ని రామగిరి మండలం కొత్తపల్లికి తరలించనున్నారు.

కాగా, గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ చ‌మ‌న్ ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. ప‌రిటాల త‌న హ‌త్య జ‌ర‌గడానికి మూడు మాసాల ముందే రవి తనను బయటకు పంపాడని ఆయన వివ‌రించారు.తన కంటే ముందు నా చావు వార్త వినకూడదని పరిటాల రవి కోరుకొన్నాడని చమన్ గుర్తు చేశారు. తమకున్న ఇంటలిజెన్స్ వ్యవస్థ ఆధారంగా త‌మ‌పై దాడి జ‌రిగే సమాచారాన్ని సేకరించేవారమని చమన్ చెప్పారు. గన్‌మెన్లు రక్షణగా ఉన్నారనే ధీమాగా రవి ఉన్నారని చమన్ గుర్తు చేసుకున్నారు. ఏం జరిగినా రాకూడదని తనకు చెప్పారని ఆయన గుర్తు చేశారు  2004 తర్వాత కూడ ఫ్యాక్షన్ అంతం కోసం పోరాటం చేయాలని రవి భావించాడని చమన్ గుర్తు చేసుకొన్నారు. అయితే ఆ సమయంలోనే పరిటాల రవి హత్యకు గురయ్యాడని చమన్ చెప్పారు. తనను రాజకీయాల్లో క్రియాశీలకంగా చూడాలని పరిటాల రవి భావించారని చమన్ చెప్పారు. చనిపోయే ముందు జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా చేయాలని తలపెట్టారన్నారు. కానీ, పరిస్థితులు అనుకూలించని కారణంగా తనను బయటకు పంపారని చమన్ ఆ ఇంట‌ర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. పరిటాల రవి కుటుంబానికి ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న ఎంపీ దివాకర్ రెడ్డి కుటుంబానికి వ్యక్తిగత విభేదాలు లేవని చమన్ చెప్పారు.

Tags:    

Similar News