రియో ఒలింపిక్స్ లో రజతం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ సింధుకు ఏపీలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలోగన్నవరం చేరుకున్నఆమెకు భారీ స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున మంత్రులు.. ఏపీ అధికారపక్ష నేతలు ఆమెను సాదరంగా స్వాగతం పలకటమే కాదు.. పక్కనుండి మరీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక.. ఆమెకు సన్మానం చేసేందుకు ఏర్పాటు చేసిన వేదిక జనంతో కిక్కిరిసిపోయింది.
స్టేడియంలోనే కాదు.. వేదిక మీద కూడా ఏపీ క్యాబినెట్ మొత్తం కొలువు తీరిందా? అన్నట్లుగా మంత్రులు.. ముఖ్యనేతలు భారీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పలువురు మంత్రులు సింధును పూలమాలలు వేసి.. శాలువాలు కప్పి సత్కరించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత అయితే సింధును అభినందించటమే కాదు.. ఆమె బుగ్గల్ని అప్యాయంగా నిమిరి.. మురిసిపోయారు.
ఏపీ ప్రభుత్వం.. మంత్రులు ప్రదర్శించిన అభిమానంతో సింధు తడిచి ముద్దదైంది. ఇదిలా ఉంటే.. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సిందు సన్మానం నేపథ్యంలో.. ఆమెను కీర్తిస్తూ పాడిన పాటల్లో పొగడ్తలు మోతాదు మించినట్లుగా కనిపించింది. ఏపీ లక్ష్యం స్వర్ణాంధ్ర అయితే.. ఒలింపిక్స్ లో స్వర్ణం సింధు లక్ష్యమంటూ పాడారు. ఆత్మీయతతో కూడిన సాదర స్వాగతం పలుకుతూ సింధు సన్మాన కార్యక్రమాన్ని ఆమెకు ఒక తీపి గురుతుగా మిగిల్చారనటంలో సందేహం లేదు.