ఏపీలో రాజకీయం ట్రెడిషనల్ బౌండరీస్ ని దాటుకుంటూ ముందుకు సాగుతోంది. దీని వెనక కార్పోరేట్ కల్చర్ ని అడాప్ట్ చేస్తున్న ఎలెక్షన్ స్ట్రాటజిస్టులు ఉన్నారా లేక కొత్త థాట్స్ తో లీడర్స్ ముందుకు వెళ్తున్నారా అన్నది పక్కన పెడితే దేశంలో చాలా చోట్ల జరగని ఎన్నో రాజకీయ విన్యాసాలు ఏపీలో జరుగుతున్నాయి.
ఏపీలో ప్రతీ ఇంటి గడపకు వెళ్లి స్టిక్కర్లు అంటించడం ఒక మెగా ప్రోగ్రాం. అంతే కాదు అక్కడ ఉన్న ఇంటి వారిలో ఒకరి చేత మిస్డ్ కాల్ చేయించి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి జగన్ వాయిస్ తో మెసేజ్ వారికి వినిపించడం వినూత్నమైనదే. ఈ నెల 7న మొదలెట్టిన మా నమ్మకం నీవే జగన్ కార్యక్రమం ఈ నెల 29 దాకా సాగింది.
ఈ మెగా పీపుల్ సర్వేకు పెద్ద ఎత్తున జనం నుంచి స్పందన వస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. వారంతా తమ ప్రభుత్వ పధకాలకు ఆకర్షితులు అయిన వారు కాబట్టే మిస్డ్ కాల్ ఇచ్చారని చెబుతున్నారు. ఏపీలో చూస్తే కోటీ అరవై అయిదు లక్షల కుటుంబాలు ఉన్నాయి. మొత్తం అన్ని గడపలు తిరగమని వైసీపీ అధినాయకత్వం ఆదేశించింది. అయితే స్టిక్కర్లు అతికించడంలో కానీ మిస్డ్ కాల్ చేయించడంలో కానీ బలవంతం ఉండరాదని, ఎవరు ఇష్టపడి ఒప్పుకుంటేనే వారితో చేయించాలని పార్టీ సూచించినట్లు చెప్పారు
దాంతో ఇపుడు కోటీ పదహారు లక్షల కుటుంబాలు అంటే వీరంతా వైసీపీ పధకాలను పొందడమే కాదు ఇష్టపడే ఈ మిస్డ్ కాల్ చేశారని పార్టీ పెద్దలు చెబుతున్నారు. దీని మీద జగన్ అయితే రాష్ట్రంలో 'మా నమ్మకం నువ్వే జగన్' కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమైందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన దీనిపై ట్విట్టర్ లో స్పందించారు. మన పాలన పట్ల, మన ప్రభుత్వ విధానాల పట్ల అచంచలమైన నమ్మకాన్ని ఉంచి ఫోన్లు చేసి నాకు మద్దతు తెలిపిన 1.16 కోట్ల కుటుంబాలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైసీపీ క్యాడర్ కు ధన్యవాదాలు అని సందేశం పెట్టారు.
ఇక మీదట మీకు మరింత సేవ చేసేందుకు దేవుని దయ, మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని జగన్ అందులో వివరించారు. ఇదిలా ఉంటే ఈ స్టిక్కర్లు అతికించిన కుటుంబాల వారు మిస్డ్ కాల్ చేసిన వారు అంతా వైసీపీ పక్షమేనా అన్న చర్చ సాగుతోంది. వారు ఈ రోజుకు పధకాలు అందుకుంటున్నారు కాబట్టి వెంట వాలంటీర్లు కూడా రావడంతో చాల మంది మొహమాటానికో మరో దానికో సరేనని అన్నారే అనుకున్నా అది నిఖార్సు అయిన అభిమానంగా చూడాలా అన్న డౌట్లు వస్తున్నాయి.
మరో వైపు తమ ఇళ్ల మీద వైసీపీ స్టిక్కర్లు అతికించవద్దు అని చాలా కుటుంబాలు వ్యతిరేకించాయి. వారంతా వేరే పార్టీకి సానుభూతిపరులుగా భావిస్తున్నారు. అలాగే ఇస్తున్న పధకాల పట్ల సంతృప్తి లేని వారు, తమకు పధకాలు అందని వారు కూడా ఈ విధంగా వద్దు మీ స్టిక్కర్లు అని గట్టిగానే చెప్పారని అంటున్నారు.
ఇక చూస్తే ఇలా వద్దు మీ స్టిక్కర్లు అన్న వారి లెక్కలు కూడా వైసీపీ దగ్గర పెట్టుకుందని అంటున్నారు. వారంతా కచ్చితంగా వైసీపీకి ఓటు వేయరని తేలిన నేపధ్యంలో వారి విషయంలో కీలక నిర్ణయం ఇటు పార్టీ పరంగా కానీ అటు ప్రభుత్వ పరంగా కానీ తీసుకుంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. అదే సమయంలో టీడీపీ నేతలు సరికొత్త ప్రచారం చేస్తున్నారు.
అదేంటి అంటే తమ పార్టీకి ఓటు వేయరని కచ్చితంగా తేలిపోయిన కుటుంబాల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రయత్నం వైసీపీ చేస్తుందని కూడా అంటున్నారు. అందువల్ల అంతా జాగ్రత్తగా ఉండాలని ఎవరూ ఓట్లను పోగొట్టుకోవద్దని కూడా హెచ్చరిస్తున్నారు. మొత్తానికి వైసీపీ మెగా పీపుల్స్ సర్వేతో కొన్ని లక్ష్యాలను సాధించుకుందని అంటున్నారు.
తమ పార్టీ పట్ల జనాలలో ఉన్న ఆదరణతో పాటు వ్యతిరేకత కూడా ఇదమిద్దంగా ఆ పార్టీ సేకరించగలిగిందని, దీనిని బట్టి రానున్న రోజులలో వైసీపీ వ్యూహాలు ప్లాన్స్ మారుతాయని అంటునారు. చూడాలి మరి కోటికి పైగా కుటుంబాలు ఒక పార్టీ వైపు కచ్చితంగా ఉన్నట్లుగా తేలితే అదే నిజమైతే మాత్రం ఏపీ రాజకీయం కొత్త మలుపు తిరిగినట్లే అంటున్నారు.