యోగా గురు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ తయారు చేసే ఆమ్లా జ్యూస్ ల్యాబ్ టెస్టులో ఫెయిలైంది. దీంతో తమ క్యాంటీన్స్ నుంచి ఆ ఉత్పత్తిని ఇండియన్ ఆర్మీ తొలగించింది. అంతేకాదు పతాంజలి కంపెనీకి కూడా షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనిపై రాందేవ్ బాబా కంపెనీ ఎఫ్ ఎంసీజీని ప్రశ్నించగా.. ఉసిరికాయ రసం ఓ వైద్య ఉత్పత్తి అని, దీనివల్ల ఎలాంటి హాని జరగదని చెప్పింది.
పతంజలి ఆమ్లా జ్యూస్ పై కోల్ కతాలోని వెస్ట్ బెంగాల్ హెల్త్ లేబొరేటరీ పరీక్షలు నిర్వహించింది. టెస్ట్ ఫెయిలైన వెంటనే ఈ ప్రోడక్ట్ అమ్మకాలను నిలిపేసి, ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సంస్థ నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్ మెంట్ తెలిపింది. అయితే ఆమ్లా జ్యూస్ ఓ ఆయుర్వేదిక్ ఔషధమని, దానిపై ఆయుష్ మంత్రిత్వశాఖ నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించాలని పతంజలి సంస్థ వాదిస్తోంది. ఈ జ్యూస్‌కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలు వర్తించవని చెబుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/