సినిమాల్లోలా జ‌గ‌న్ పార్టీ నేత‌ను చంపేశారు

Update: 2017-05-21 09:50 GMT
ఫ్యాక్ష‌న్ ప‌డ‌గ‌నీడ ఉండే నాయ‌కుల ప్రాణాలు ఏదో ఒక రోజు అదే ఫ్యాక్ష‌న్‌ లో పోతాయ‌న్న మాట‌ను నిజం చేస్తూ తాజాగా దారుణ హ‌త్య‌లు క‌ర్నూలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చెరుకుల‌పాడు నారాయ‌ణ‌రెడ్డిని ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు అత్యంత దారుణంగా చంపేశారు. ప‌త్తికొండ పార్టీ ఇంఛార్జ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న హ‌త్య మొత్తం సినీ ప‌క్క‌లో జ‌ర‌గ‌టం గ‌మ‌నార్హం.

మాటు వేసి మ‌రీ.. ప‌క్కా ప్లాన్‌తో ఆయ‌న్ను హ‌త్య చేసినట్లు జ‌రిగిన దారుణాన్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. ప్ర‌ముఖ ఫ్యాక్ష‌నిస్టు క‌ప‌ట్రాళ్ల వెంక‌ట‌ప్ప‌య్య‌నాయుడు హ‌త్య కేసులో నేరారోప‌ణ‌లు ఎదుర్కొన్న నారాయ‌ణ రెడ్డిని నిర్దోషిగా కోర్టు ప్ర‌క‌టించింది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండేవారు. ప్ర‌త్య‌ర్థులు త‌న‌ను ఏదో ర‌కంగా దాడి చేస్తార‌న్న సందేహంతో జాగ్ర‌త్త‌లు తీసుకునే వార‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల త‌న‌కున్న లైసెన్స్ తుపాకీని రెన్యువ‌ల్ కోసం జిల్లా పోలీసుల‌కు ఇచ్చిన ఆయ‌న‌.. అప్ప‌టి నుంచి ఆయ‌న ఎలాంటి ఆయుధం లేకుండా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీ ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి  మీద పోటీ చేసి ఓడిపోయారు. ఆదివారం నంద్యాల‌లో జ‌రిగిన సూర్య‌నారాయ‌ణ‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజ‌రైన ఆయ‌న‌.. వెల్దుర్తి మండ‌లంలోని కొస‌నాప‌ల్లెలో హ‌నుమంతు కుమారుడు కే ర‌మేశ్ పెళ్లికి హాజ‌ర‌య్యారు. ఉద‌యం 11.30 గంట‌ల‌కు కారులో స్వ‌గ్రామానికి వ‌స్తున్న వేళ‌..కృష్ణ‌గిరి మండ‌లం రామ‌కృష్ణాపురం గ్రామ‌శివారుకు వ‌చ్చే స‌మ‌యానికి క‌ల్వ‌ర్టు వద్ద ప్ర‌త్య‌ర్థులు కాపు కాసి ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారును వెనుక నుంచి టాక్ర‌ట‌ర్‌ తిరుగు ప్ర‌యాణంలో దారుణంగా హ‌త్యకు గుర‌య్యారు. ఆయ‌న క‌ద‌లిక‌ల మీద ప్ర‌త్యేకంగా పెట్టిన దృష్టి పెట్టి మ‌రీ ప్ర‌త్య‌ర్థులు దారుణంగా చంపిన‌ట్లుగా భావిస్తున్నారు.  ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారును వెనుక నుంచి ట్రాక్ట‌ర్ తో ఢీ కొట్టింది.. ముందువైపు మ‌రో మూడు ట్రాక్ట‌ర్ల‌ను తీసుకొని కారుకు అడ్డంగా పెట్టేశారు. కారు ముందుకు క‌ద‌ల‌కుండా చేసి.. బాంబులు విసిరారు. అదే స‌మ‌యంలో నారాయ‌ణ ప్ర‌యాణిస్తున్న కారు వైపు 15 నుంచి 20 మంది వ‌ర‌కూ ఒకేసారి దాడికి పాల్ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. ఎటువైపున‌కు క‌ద‌ల‌కుండా చేసేసి.. క‌త్తుల‌తో దాడి చేసి.. వేట‌కొడ‌వ‌ళ్ల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా న‌రికేశారు. ఈ దాడిలో ఆయ‌న ప్ర‌ధాన అనుచ‌రుడ్ని కూడా చంపేసిన‌ట్లుగా తెలుస్తోంది.

త‌న ప్రాణాల‌కు హాని ఉంద‌ని.. పోలీసుల‌కు ఈ మ‌ధ్య‌నే చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. చేతిలో ఎలాంటి ఆయుధం లేద‌ని తెలిసిన నేప‌థ్యంలో ఆయ‌న్ను టార్గెట్ చేసిన మ‌ట్టుపెట్టిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ ప‌రిణామం ప్ర‌తిప‌క్ష పార్టీలో పెను విషాదం నెల‌కొంది. ప్ర‌స్తుతం స్థానికంగా తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News