ఎవరు ఎలా ఉండాలన్నది వారిష్టం. అందునా రాజకీయాల్లో ఏ పార్టీని ఫలానా రీతిలో ఉండాలన్న మాట అనటంలో అర్థం లేనిది. ఎందుకంటే.. రాజకీయాల్లో ఎప్పుడూ ఏమైనా జరగటం ఖాయం. ఏదైనా సాధ్యమే. ఈ విషయాన్ని వదిలేసి.. తమ వాదనను వినిపించే విషయంలో వైసీపీ నేతలు తమ గీతను తరచూ దాటేస్తుంటారు. తమ సంగతి తాము చూసుకునే విషయంలో శ్రద్ధ పెట్టని వారు.. తమ రాజకీయ పార్టీలు మాత్రం ఫలానా రీతిలో ఉండాలని.. తాము కోరుకున్నట్లుగా ఉండాలన్న మాటల్ని వారి నోటి వెంట వింటే.. మరీ ఇంత అత్యాశతో మాట్లాడే నేతలు వైసీపీలో తప్పించి మరే పార్టీలోనూ కనిపించన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా రావాలంటూ రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు తరచూ చేసే వ్యాఖ్యలపై తాజాగా పవన్ స్పందించారు. మళ్లీ వైసీపీ నేతల నోటినుంచి ఈ తరహా వ్యాఖ్యలు చేసేందుకు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలన్న విషయాన్ని స్పష్టం చేస్తూ పవన్ పంచ్ లు అదిరిపోయాయని చెప్పాలి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వైసీపీ వాళ్లు సింహం సింగిల్ గా వస్తామని చెబుతున్నారు వాళ్లు సింగిల్ గా.. సింహంలా వచ్చి ప్రజలందరిని చీల్చి చెండాడేస్తున్నారు. ఇలాంటి డైలాగులు సినిమాల్లో నేను చెబుతా. నిజ జీవితంలో నేను చెప్పను. సింహాలు గడ్డం గీసుకోవు.. నేను గీసుకుంటా లాంటివి సినిమాల్లో చెబుతాం.. బాగుంటాయి’’ అని పవన్ వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. వైసీపీ నేతలకు తాను చెప్పాలనుకుంటున్న విషయాన్ని స్పష్టంగా.. సూటిగా చెప్పేశారు. ఏపీ అధికార పక్షం నేతలకు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చేశారు. ‘‘మాట్లాడితే చాలు.. మీరు సింగిల్ గా రావాలి.. సింగిల్ గా రావాలని అంటున్నారు. సింగిల్ గా రావాలా? వద్దా? అన్నది నేను డిసైడ్ చేయాలి. నువ్వు ఎవడయ్యా నాకు చెప్పటానికి? మేం అడుగుతున్నామా? నువ్వు ఏం తిండి తినాలి? ఎవరితో మాట్లాడాలని వైసీపీ వాళ్లను మేమైనా అడుగుతున్నామా? మీకు ఎక్కడ నుంచి హక్కు ఉంది మమ్మల్ని అడగటానికి? కొంచెం తగ్గాలి.. కొంచెం తగ్గాలి మీరు. మీకు అతి కాస్త ఎక్కువైంది కాస్త తగ్గాలి’’ అంటూ అదిరే వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా వైసీపీ నేతలకు తాను ఒక్కటే చెబుతున్నానని.. రాజకీయాల్లో పౌరుషాలు ఉండవు.. వ్యూహాలు మాత్రమే ఉంటాయి గుర్తు పెట్టుకోవాలన్నారు.‘ ఆ వ్యూహం ప్రజా సంక్షేమం కోసం తప్పించి.. నాకు పదవి కావాలని నేనెప్పుడు వ్యూహం వేయను. మీ గుండెల్లో ఉండే పదవి కంటే నాకు ఏ పదవి ఎక్కువ కాదు’ అని స్పష్టం చేశారు.
పవన్ మాటల్ని విన్నప్పుడు.. తనను నోటికి వచ్చినట్లుగా మాట్లాడే వారి విషయంలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడొచ్చు. కానీ.. అలాంటిదేమీ లేకుండా జాగ్రత్తగా.. ఆచితూచి అన్నట్లుగా మాట్లాడే తీరు చూస్తే.. ఇప్పుడున్న ఏపీ రాజకీయాల స్థాయిని కాస్త పెంచేందుకు జనసేన అదినేత పవన్ లాంటి వారి అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.