విశాఖ ఉక్కు ఉద్యమాన్ని రగిలించడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. తాజాగా పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను జనసేన పార్టీ ప్రకటించింది. ఉక్కు పరిరక్షణ పోరాట ఉద్యమానికి సంఘీభావం తెలుపనున్న పవన్ కళ్యాణ్.. ఈనెల 31 మధ్యాహ్నం ఉక్కు పరిరక్షణ సభలో పాల్గొంటారని వెల్లడించారు.
కేంద్రప్రభుత్వం మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను వదులుకోవడానికి సిద్ధంగా లేని కార్మిక, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తూ వస్తున్నాయి. వారికి వివిధ రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతుండగా.. ఇప్పుడు ఉక్కు పరిరక్షణ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.
మరోవైపు ఉపాధి కోసం గిరిజనులు గంజాయి ఉచ్చులో చిక్కుకొని నేరస్తులుగా మారుతున్నారని జనసేన అధికార ప్రతినిధి విజయ్ కుమార్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సరిగ్గా వాడితే గిరిజన యువత ఇలా దారి తప్పే పరిస్థితి లేదన్నారు.
ఇటీవలే పవన్ కళ్యాణ్ ఏపీలో డ్రగ్స్, గంజాయి సాగు పెరిగిపోయిందని.. ప్రభుత్వం చోద్యం చూస్తుందని ట్వీట్లతో విరుచుకుపడ్డారు. అంతేకాదు.. ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లో తాను పర్యటించి గంజాయి సాగు అవుతుందన్న వీడియోను షేర్ చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలుతోందని విమర్శించారు. ఇప్పుడు స్వయంగా ఉద్యమించేందుకు పవన్ రెడీ అయ్యారు. విశాఖ పర్యటనకు బయలు దేరారు.