పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు తెలియవు అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ఆయనది దాదాపుగా పదిహేనేళ్ల రాజకీయ జీవితం. ఆయన మూడు ఎన్నికలను చూశారు. నాలుగవ ఎన్నికకు సిద్ధపడుతున్నారు. ఆయనకు రాజకీయాల్లో ఎవరేమిటి అన్నది బాగా తెలుసు.
ఇక పవన్ టార్గెట్ సీఎం సీటు. అదే విధంగా తన పార్టీకి జన బలం ఉంది. దాంతో రేపటి ఎన్నికల్లో మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీతో ఉంటే తన సీఎం కల నెరవేరదు అని పవన్ కి తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు. కత్తిపూడి సభలో విడిగానో అని గ్యాప్ ఇచ్చి ఉమ్మడిగానో అని పవన్ అన్నప్పుడు విడిగా అన్న మాట దగ్గరే జన సైనికులు రెట్టించిన ఉత్సాహంలో ఈలలు వేసి చప్పట్లు కొట్టారు.
మరి అది పవన్ దృష్టిని దాటిపోదు కదా. అంతే కాదు, టీడీపీ జనసేన పొత్తులకు ఒక ప్రాతిపదిక ఉంది. అప్పట్లో బీజేపీ వైసీపీని వీడదు అని పవన్ భావించారు. దాంతో టీడీపీ వైపు వచ్చారు. అయితే టీడీపీలో గౌరవప్రదమైన సీట్లు అంటే ఏ ఇరవైనో పాతిక సీట్లో అన్నట్లుగా సీన్ ఉందని టాక్.
అరవై సీట్ల దాకా జనసేనకు కావాలన్నది ఒక ప్రచారంలో ఉన్న మాట. మొత్తం 175 సీట్లలో టీడీపీని వంద సీట్లకు పరిమితం చేసి మిత్రులుగా బీజేపీ జనసేన 75 సీట్లు సర్దుకుంటే ఎన్నికల తరువాత కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. కానీ టీడీపీ మాత్రం పొత్తులకు పాతిక ముప్పయి సీట్లు ఇచ్చి నూటాభైకి తక్కువ కాకుండా పోటీ చేయాలని చూస్తోందని అంటున్నారు.
అలా అయితే రేపటి రోజున సోలోగా అధికారంలోకి రావచ్చు అన్నది టీడీపీ ఎత్తుగడ. దానివల్ల జనసేనకు ఉపయోగం ఉండదు. పైగా ఒకసారి అధికారంలోకి వచ్చాక టీడీపీ అయినా వైసీపీ అయినా ఒక్కటే. వారు తమ రాజకీయానికి పదును పెట్టి ఆపరేషన్ జనసేన స్టార్ట్ చేస్తే అసలుకే ఎసరు వస్తుంది.
అందుకే జనసేన తెలివిగా టీడీపీని వంద సీట్లకు పోటీ చేసేలా పరిమితం చేసే ప్లాన్ వేస్తూనే ప్లాన్ బీ కూడా అమల్లోకి తెస్తోంది అని అంటున్నారు. అదేంటి అంటే బీజేపీతో కలసి పోటీ చేయడం. ఎటూ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ పార్టీతో జనసేనకు నాలుగేళ్ల క్రితమే పొత్తు ఉంది.
పైగా బీజేపీ తోడు ఉంటే జనసేన దూకుడు వేరే లెవెల్ లో ఉంటుంది అని అంటున్నారు. వ్యవస్థలను కంట్రోల్ లో పెడితే జనసేన విక్టరీకి ఆస్కారం ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. అందుకే పవన్ ధీమాగా ఒక్క చాన్స్ ఇవ్వండి అని జనాలకు అప్పీల్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇక రేపటి రోజున ఈ ట్రయాంగిల్ పోటీలో నష్టం ఎవరికి వచ్చినా కింగ్ మేకర్ గా జనసేన ఉంటుంది. ఆ మీదట అధికారం కోసం తమ దగ్గరకు ఎవరు వచ్చినా కింగ్ అయ్యే చాన్స్ ఉంటుంది అని భావిస్తోంది.
మొత్తానికి చంద్రబాబు కానీ టీడీపీ కానీ ఇస్తే బిగ్ నంబర్ సీట్లు పొత్తు పార్టీలకు ఇవ్వాలి. లేకపోతే బీజేపీ జనసేన విడిగా పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. ఈ పరిణామాలు ఇపుడు టీడీపీని అలెర్ట్ అయ్యేలా చేస్తున్నాయి. అయితే టీడీపీ మెజారిటీ సీట్లు వదులుకోవడానికి సిద్ధంగా లేదు అంటున్నారు. ఆ దిశగా కనీస ఆలోచన చేసినా టీడీపీ నుంచి గట్టి రివోల్ట్ వస్తుంది అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఏపీలో త్రిముఖ పోరు తప్పకపోవచ్చు అన్నదే లేటెస్ట్ టాక్. అందుకే పవన్ ఎక్కడా వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వమని స్టేట్మెంట్స్ ఇవ్వడం లేదు అంటున్నారు.