పవన్ లో మరీ ఇంత అయోమయమా ?

Update: 2022-05-09 12:10 GMT
షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాత్రం క్లారిటీ రావటం లేదు. శెరివెళ్ళలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించే విషయంలో తనలోని అయోమయాన్ని బయట పెట్టుకున్నారు.

పవన్ మాట్లాడుతూ జగన్ను ఓడించాలనే తన బలమైన కోరికను వెలిబుచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బ కొట్టడం, ఎత్తుకు పై ఎత్తు వేసి చిత్తు చేయటం రాజకీయాల్లో చాలా సహజంగానే ఉంటుంది.

కానీ పవన్ విషయంలో మాత్రం ఎత్తు లేదు పై ఎత్తూ ఉన్నట్లు లేదు. ఉన్నదల్ల జగన్ ఓడించాలన్న కోరిక మాత్రమే. ఇదే విషయమై పవన్ మాట్లాడుతూ జగన్ ని ఎలా ఓడించాలో తనకు తెలియదని ఆయనే చెప్పుకున్నారు. కానీ ఏదో అద్భుతం జరగకపోతుందా అని ఎదురు చూస్తున్నారట. జగన్ ను ఓడించేందుకు తెలుగుదేశం పార్టీతో పాటు మిగిలిన పార్టీలతో కూడా పొత్తులు పెట్టుకోవాలని బలంగా కోరుకుంటున్నది వాస్తవం.

పవన్ కోరికను ఆదిలోనే మిత్రపక్షం బీజేపీ గండికొడుతున్నది. చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ నేతలు ససేమిరా అంటున్నారు. దాంతో మిత్రపక్షాన్ని ఎలా ఒప్పించాలో అర్ధంకాక పవన్ తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తనలో ఎలాంటి వ్యూహాలు లేవని పవన్ చెప్పకూడదు. నిజంగానే వ్యూహాలు ఏమీ లేకపోయినా ఆ విషయాన్ని బయటకు చెప్పకూడదు. ఏదో బలమైన వ్యూహం ఉన్నట్లే కనీసం పైకి బిల్డప్ ఇవ్వాలి.

దీనివల్ల ప్రత్యర్ధులతో పాటు మీడియాను కూడా సస్పెన్స్ లో ఉంచినట్లవుతుంది. కానీ అలాకాకుండా తన దగ్గర వ్యూహాలేమీ లేవని అందుకనే అద్భుతం ఏదో జరగకపోతుందా అని ఎదురు చూస్తున్నట్లు ప్రకటించగానే పవన్లోని అయోమయం బయటపడిపోయింది.

ఏదో అద్భుతం కోసం ఎదురు చూసేటపుడు జగన్ను ఓడిస్తామని చాలెంజ్ చేయటం ఎందుకు ? జరిగే అద్భుతం జరిగి జగన్ ఓడిపోయేంతవరకు ఓపిగ్గా వెయిట్ చేయచ్చుకదా. ఇంతోటిదానికి చాలెంజులు, బహిరంగసభలు, పొత్తులంటు హడావుడులు, రోడ్డుమ్యాపులు అవసరమా ?
Tags:    

Similar News