జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని ఆసక్తికరమైన రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలుపుతూ పత్రిక ప్రకటన విడుదల చేసిన పవన్ ఇందులో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, తన పోరాట పంథాకు సంబంధించిన అంశాలను సైతం వెల్లడించడం గమనార్హం. పవన్ పత్రికా ప్రకటన ఈ విధంగా ఉంది....
``ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగువారందరికీ, దేశ ప్రజలకు నా తరపున, జనసేన సైనికుల తరపున హేమలంబ నామ ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ప్రకృతి అనుకూలించి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, అభివృద్ధిపథంలో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉండాలని కోరుకుంటున్నాను. గడచిన దుర్ముఖి నామ సంవత్సరం తమకు పెద్దగా మేలుచేయలేకపోయిందన్న భావనతో ఉన్న తెలుగు ప్రజల ఆశలు హేమలంబ వసంతంలో అయినా నెరవేరాలని ఆశిస్తున్నాను. రాష్ట్ర విభజన నాటి హామీలు సంపూర్ణంగా అమలు కావాలన్న ప్రజల కోరిక ఫలించాలని ఆకాంకిస్తున్నాను. రైతులు, చేనేత కళాకారులు, శ్రామిక వర్గాలతోపాటు దేశంలోని ప్రతీ కుటుంబానికి శాంతి, సౌభాగ్యాలను హేమలంబ ప్రసాదించాలని జనసేనపార్టీ కోరుకుంటోంది.` అని పేర్కొన్నారు!
ఇదిలాఉండగా...జనసేన పార్టీ కోసం కార్యకర్తల ఎంపికను భిన్నంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందుకోసం మరే పార్టీ పాటించని విధంగా పత్రికా ప్రకటన విడుదల చేసి ఆసక్తి గలవారిని ఎంపిక చేసేందుకు దరఖాస్తులు కోరింది. `జనసేన పార్టీలోని వివిధ విభాగాల్లో జన సైనికులను భాగస్వామ్యుల్ని చేసే కార్యక్రమం ప్రారంభం అవుతోంది. పార్టీ తరపున గొంతెత్తడానికి స్థానిక జిల్లా వారి ప్రాంతపు సమస్యలపైన,అలాగే సమగ్రస్థాయి రాష్ట్రస్థాయి సమస్యలపైన అవగాహన ఉన్నవారిని స్పీకర్స్ గాను, రైటింగ్ స్కిల్స్ వున్నవారిని కంటెంట్ రైటర్స్ గాను, చక్కటి విశ్లేషణలను చేయగలవారికి అనలిస్టులు గా పార్టీకి సేవలు అందించడానికి పార్టీ ఆహ్వానం పలుకుతోంది. మిమ్మల్ని మీ ప్రాంతంలోనే కలుసుకుని మీతో మాట్లాడడానికి జనసేన బృందం హైదరాబాద్ నుంచి మీ జిల్లాకు వస్తోంది. ముందుగా ఈ కార్యక్రమం అనంతపురం జిల్లా నుంచి ప్రారంభం అవుతుంది. క్రమంగా అన్ని జిల్లాల్లో మొదలవుతుంది. ఆన్‌లైన్లో అప్లికేషన్ కోసం www.janasenaparty.org/resourcepersons ద్వారా దరఖాస్తు చేసుకోవాలి` అని వివరించింది.