2015 లో గొడ‌వైతే 2023 లో క్ష‌మాప‌ణ‌లా?

Update: 2023-07-01 13:00 GMT
స్టార్ హీరోల అభిమానుల మ‌ధ్య వార్ స‌హ‌జం. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని సోష‌ల్ మీడియా లో వార్ కి దిగిన సంద‌ర్భాలోన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఆ ర‌చ్చ పీక్స్ లో ఉంటుంది.  స‌రిగ్గా 2015 లో ప‌వ‌న్ క‌ళ్య‌ణ్‌- ప్ర‌భాస్ అభిమానుల మ‌ధ్య ఇలాంటి వార్ ఒక‌టి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. భీమ‌వ‌రంలో అప్ప‌ట్లో ఇరువురు హీరోల అభిమానులు ప‌బ్లిక్ గా ఒక‌ర్నీ ఒక‌రు దూషించుకున్నారు. ఇద్దరి ఫ్యాన్స్ మధ్య పోస్టర్ల వైరం జరిగింది.

ఒకరి పోస్టర్లను మరొకరు చింపేసుకుని దుర్బాష‌ల‌డుకున్నారు. ఈ విష‌యం అప్ప‌ట్లోనే ప‌వ‌న్...ప్ర‌భాస్ ల వ‌ద్ద‌కు చేరింది. అయితే దీనిపై  ప‌వ‌న్ గానీ...డార్లింగ్ గానీ స్పందించ‌లేదు. రియాక్ట్ అయితే వైరం మ‌రింత ముదిరింద‌ని భావించి ఇద్ద‌రు సైలైంట్ గానే ఉన్నారు.

తాజాగా ఈ  వివాదంపై ప‌వ‌న్ భీమ‌వ‌రం రాజ‌కీయ  బ‌హిరంగ స‌భ  ప్ర‌సంగంలో భాగంగా స్పందించారు. ఆ ఘటన తనను ఎంతో బాధించిందని.. ఎవరైనా పొరపాటున పోస్టర్ చింపేసినా... దాన్ని క్షమించి.. అక్కడితో వదిలేయాలని కోరారు.

చిన్నచిన్న ఘటనలను పెద్ద‌వి చేసి చూడొద్ద‌ని... కోపంలో ఏన్ని అనుకున్నా అవి అప్ప‌టితో వ‌దిలేయాల‌ని అభిమానుల‌కు సూచించారు. హీరోలంద‌రి  అభిమానులు ఐకమత్యంగా ఉండాలని చేతులెత్తి వేడుకున్నారు. భీమవరంలో ప్రభాస్ అభిమానులు ఎక్కువగా ఉంటారని... అలాగే ఎన్టీఆర్.. మహేశ్ బాబు.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఉంటారని  గుర్తు చేసారు. తాను గెలవాలంటే తన ఒక్క హీరో అభిమానులే సరిపోరని... అందరి అభిమానం తనకు కావాలన్నారు.

తాజాగా ఈ  వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అయితే స‌మ‌యం వ‌చ్చింది కాబ‌ట్టి ప‌వ‌న్ ఇప్పుడు స్పందించారు.  లేదంటే ఆయ‌న ఆ వైరం గురించి ప‌ట్టించుకునేవారా? అని! క్ష‌మాప‌ణ‌లు అడిగే వారా? అని ప‌వ‌న్ వ్య‌తిరేక వ‌ర్గం అంటోంది.

గ‌తంలో ఎప్పుడూ ప‌వ‌న్ క‌నీసం సోష‌ల్ మీడియాలో కూడా అభిమానుల్ని ఉద్దేశించి స్పందించ‌లేద‌ని గుర్తు చేస్తున్నారు. అభిమానులంతా క‌లిసి ఉండాల‌ని.. బాగుండాల‌ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఓ వేదిక‌పై అన్నారు. అంత‌కు ముందు సోష‌ల్ మీడియ‌లోనూ స్పందించారు.

Similar News