'టీడీపీలో ఎందుకు చేరలేదు' అన్న బాలయ్య ప్రశ్నకు పవన్ సమాధానమిదీ

Update: 2023-02-10 21:00 GMT
బాలయ్య హోస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌  గెస్ట్ గా పాల్గొన్న అన్‌స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్  ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. పవర్ ఫైనల్ రెండవ ఎపిసోడ్ చాలావరకు రాజకీయంగా సాగింది.  పవన్ రాజకీయాలు, వ్యక్తిగతాన్ని టచ్ చేసింది.  ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయ అడుగులపై బాలయ్య సూటిగా ఓ ప్రశ్న సంధించాడు.

బడుగుల పార్టీగా సంక్షేమ అజెండాతో టీడీపీ అభివృద్ధి చెందిందని, ఎన్టీఆర్ ఉత్తమ సంక్షేమ పథకాలు, సంస్కరణలను ఆవిష్కరించారని బాలయ్య అన్నారు. 'ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా టీడీపీ తీసుకొచ్చిన సంస్కరణలను పథకాలనే మార్చి అనుసరిస్తోంది.

ఇక టీడీపీ చేయని సంక్షేమం, అభివృద్ధి లేదు. కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించాలని మీకు ఎందుకు అనిపించింది? అలా కాకుండా మీరు తెలుగుదేశంలో చేరితే అయిపోయి ఉండేది కదా' అని బాలయ్య తాజా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.

దీనికి పవన్ గట్టిగానే సమాధానమిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారం కేవలం రెండు మూడు అగ్రకులాలకే పరిమితమైంది.  పేదలకు, ఇతర కులాలకు కూడా అధికారం, సాధికారత కావాలని పవన్ కల్యాణ్ అన్నారు. రాజకీయాలు క్లీన్‌గా, నియంతృత్వ రహితంగా ఉండాలని కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.

'నేను ఏ పార్టీలోకి రాలేను. మీరు గమనిస్తే నేను కాంగ్రెస్‌లోకి వెళ్లలేదు. నేను ఏ ఇతర రాజకీయ పార్టీలో చేరినా నా ఆలోచనను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేను. రాబోయే తరానికి సరైన రాజకీయ వాతావరణం లేదు. ఉన్న రాజకీయ పార్టీలో చేరితే నా ఆలోచనలను ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్లగలనో నాకు తెలియదు' అని పవన్ కల్యాణ్ అన్నారు.

పవన్ కళ్యాణ్ తన భావజాలం నిష్పక్షపాతంగా ప్రజలకు చేరాలని కోరుకుంటున్నందున ప్రస్తుతం ఉన్న ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదా విలీనం చేయాలనే ఉద్దేశం లేనట్లు కనిపిస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో రాజకీయ పొత్తుల విషయంలోనూ ఇదే కట్టుబడతాడో లేదో చూడాలి.     



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News