ఏపీలో వైసీపీ సర్కార్ ఉండరాదని పవన్ 2014 నుంచి కోరుకుంటూనే ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఆయన తన పార్టీని పోటీ చేయించకుండా టీడీపీకి మద్దతు ఇచ్చి అధికారంలోకి రావడానికి ఫుల్ హెల్ప్ చేశారు. ఇక 2019 నాటికి సీన్ మారింది. పవన్ విపక్షం ఓట్లు చీలడానికి వేరేగా పోటీ చేసి టీడీపీకి లాభం కలిగించారని వైసీపీ నేతలు అంటారు. ఇపుడు చూస్తే వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అంటూ పవన్ బిగ్ సౌండ్ చేస్తున్న సంగతి విధితమే.
ఇదిలా ఉంటే 2019 ఎన్నికల వేళ జగన్ ఈ జన్మలో సీఎం కాలేడని పవన్ గట్టిగానే చెప్పారు. కానీ జగన్ సీఎం అయ్యారు. ఇదిలా ఉంటే గత మూడున్నరేళ్ళుగా జనసేన వైసీపీకి వ్యతిరేకంగా బాగానే పోరాడుతున్నారు. ఒక వైపు టీడీపీతో పొత్తుకు కూడా జనసేన సుముఖంగా ఉందని ఈ మధ్యనే సంకేతాలు పంపించారు. ఈసారి వైసీపీ అధికారంలోకి రాకూడదు అన్నదే జనసేన పంతం.
ఆ విషయాన్ని ఎక్కడా ఆయన దాచుకోకుండా వీలు దొరికినపుడల్లా చెప్పేస్తున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలు చూస్తే ఇంకా ఏణ్ణర్ధం పైగా బిగిసి ఉన్నాయి. ఈ నేపధ్యంలో పవన్ మరోసారి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ సర్కార్ త్వరగానే కూలిపోవడం ఖాయమని ఆయన శాపనార్ధాలు పెట్టారు. పవన్ కి అంత కోపం రావడానికి కారణం ఏమిటి అంటే అమరావతి రాజధాని దగ్గర ఇప్పటం గ్రామం ఉంది. ఆ గ్రామం పవన్ జనసేన ఆవిర్భావ సభకు స్థలాన్ని ఇచ్చింది.
దానికి గానూ ఆ గ్రామస్థుల మీద వైసీపీ సర్కార్ కక్ష కట్టిందని పవన్ ఆరోపిస్తున్నారు. ఆ గ్రామంలో ఉన్న రోడ్లు 70 అడుగుల వెడల్పు ఉంటే దాన్ని 120 అడుగులుగా వేయడానికి ప్రభుత్వం ఆలోచన చేసింది. ఈ మేరకు నోటీసులు ఇచ్చి మరీ జేసీబీలు తెచ్చి కూలగొట్టేస్తోంది. దీంతో ఇప్పటంలో రోజంతా ఉద్రిక్తతలు చెలరేగాయి. మరో వైపు దీని మీద జనసేనకు చెందిన కొందరు కోర్టులో అత్యవసర కేసులుగా పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టు సైతం కూల్చివేతలు ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయం ఇపుడు వైసీపీ వర్సెస్ జనసేనగా మరో వార్ కి దారి తీస్తోంది. దాంతో పవన్ సడెన్ గా ఒక ప్రకటన విడుదల చేశారు. కూల్చివేతలతో వైసీపీ పాలన మొదలైంది, ఇప్పటికీ అదే సాగిస్తోంది. ఈ ప్రభుత్వం కూలిపోకతప్పదని కూడా పవన్ శపించేశారు.
చాలా త్వరలోనే ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని కూడా పవన్ జోస్యం చెప్పారు. వైసీపీకి ఓట్లు వేయని వారి మీద ఈ తీరున కక్ష కడతారా వారిని వేధిస్తారా అంటూ పవన్ మండిపడుతున్నారు. పోలీసు బలగాల సాయంతో అక్కడ ఉనన్ ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఇది అన్యాయం, దారుణం అని ఆయన అన్నారు.
ఇలాంటి పైశాచిక చర్యలు చేస్తున్న ప్రభుత్వం కూలిపోవడానికి ఎంతో దూరం పట్టదని పవన్ ఆగ్రహించారు. మొత్తానికి పవన్ మరోసారి వైసీపీ సర్కార్ ఉండకూడదని గట్టిగా చెప్పారు. ఈసారి త్వరగా కూలాలని ఎన్నికల కంటే ముందే దిగిపోవాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి దీనికి వైసీపీ వారి రిటార్ట్ ఎలా ఉంటుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.