నేను సినిమాలు చేయనంటే చేయను... పవన్

Update: 2019-07-31 16:37 GMT
రాజకీయాల్లో రాణించలేకపోవడంతో పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారానికి ఆయనే స్వయంగా తెరదించారు. తాను ఇప్పుడేమీ మళ్లీ సినిమాల్లోకి వెళ్లడం లేదని.. రాజకీయాల్లో తన సత్తా ఏంటో చూపించబోతున్నానని.. అక్టోబరు నుంచి అసలైన ఆట మొదలవుతుందని అన్నారు.

అంతేకాదు.. బీజేపీలో జనసేనను విలీనం చేస్తారన్న ప్రచారాన్నీ ఆయన ఖండించారు. ఇతర పార్టీలకు అప్పనంగా అప్పగించడానికి జనసేనను స్థాపించలేదన్నారు పవన్. గత ఎన్నికల సమయంలో తనకు జాతీయ పార్టీల నుంచి ఆహ్వానం అందిందని.. అలాగే ఇతర రాష్ట్రాల్లోని పెద్దపెద్ద నాయకులు కూడా ఎన్నికల సమయంలో తనకు సహకరిస్తామంటూ ముందుకొచ్చారని.. కానీ, తాను సొంతంగా ఎన్నికల్లో ముందుకెళ్లాలని నిర్ణయించుకుని ఆ ఆఫర్లన్నీ వదులుకున్నానని పవన్ చెప్పారు.

ఇప్పటివరకు జరిగిందంతా ఒకెత్తు.. చాలా విషయాల్లో నేను మౌనంగా ఉన్నాను. కానీ, రానున్న అక్టోబరు తరువాత రాజకీయ నాయకుడిగా నా అసలైన యాక్టివిటీ చూడండి అంటున్నారు పవన్.

పవన్ ఇటీవల నిర్మాత ఏఎం రత్నంను కలిసి కొన్ని మంచి ప్రాజెక్టులతో వస్తే కొత్త సినిమా చేద్దాం అని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. దీంతో.. పవన్ పార్టీని బీజేపీలో కలిపేసి మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారంటూ ఆయన వ్యతిరేకులు ప్రచారం మొదులుపెట్టారు. దానిపై పవన్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. మళ్లీ తిరిగి సినిమా ఇండస్ట్రీకి వచ్చే ప్రణాళికలేమీ లేవని పవన్ చెప్పుకొచ్చారు.

    

Tags:    

Similar News