పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెబితే చాలు అభిమానులకు పూనకం వచ్చేస్తుంది. ఐతే ఆ పూనకం రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు. రెండు రాష్ట్రాల సరిహద్దులు దాటినా పవర్ స్టార్ పవర్ స్టారే. ఇక్కడ హైదరాబాద్‌లో బయటికెళ్లడం చాలా కష్టమవుతోందని.. పైగా ఇక్కడుంటే రాజకీయ అంశాలపై నోరు విప్పడేంటని ప్రశ్నలు సంధిస్తున్నారని.. సైలెంటుగా బెంగళూరుకు వెళ్లిపోయాడు పవర్ స్టారుడు. గబ్బర్‌సింగ్-2 సినిమా కోసం ఫిట్‌గా తయారవ్వడానికి అక్కడే మకాం వేశాడు పవన్.
ఐతే గుట్టుచప్పుడు కాకుండా ఓ ట్రైనర్‌ను పెట్టుకుని హైప్రొఫైల్ జిమ్‌లో సాధన చేయడం మొదలుపెట్టాడు కానీ.. గుబురు గడ్డంతో వచ్చిపోతున్నా జనాలు పవన్‌ను గుర్తుపట్టేశారు. పవన్ ఇక్కడే ట్రైనింగ్ తీసుకుంటున్నాడన్న సంగతి తెలిసిపోయి అభిమానులు పోగయ్యారు. ఆ సంఖ్య వేలల్లోకి చేరిపోయింది.పవన్ ఎప్పుడు వస్తాడా.. ఎప్పుడు వెళ్తాడా అని అభిమానులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఇంకేముందు ఆ జిమ్ ముందు ట్రాఫిక్ జామ్ సమస్యలు మొదలయ్యాయి. అభిమానుల్ని అదుపు చేయడానికి పెద్ద సంఖ్యలో పోలీసుల్ని ఉపయోగించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఆ జిమ్‌కు పవన్ వస్తున్న సంగతి బాగా ప్రచారమైపోవడంతో ఇంకో కొత్త జిమ్ ఏదైనా చూసుకుందామనుకుంటున్నాడట పవన్. అదీ సంగతి!