ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో "పవన్ కళ్యాణ్ ఏలూరు" అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏలూరుకు తన ఓటును మార్పించుకోవడంతో పాటు జనసేన నుంచి పోటీచేస్తారని - బాబుకు షాకిచ్చారని - కాపు ఓటుబ్యాంకు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడమే కారణమని ఇలా రకరకాల కథనాలు వచ్చిపడుతున్నాయి. ఈ క్రమంలో ఏలూరులో పవన్ ఇల్లు ఇదే అంటూ ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అడ్రస్ తోనే పవన్ కొత్త ఓటు ఉండబోతుందని సమాచారం!!
ప్రస్తుతం ఏపీకి చెందిన చాలామంది రాజకీయ నాయకులు నివసించేది హైదరాబాద్ లోనే అయినా వారి ఓటుహక్కు మాత్రం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటుంది! ఈమద్యకాలంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తన ఓటును విజయవాడకు మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఏపీకి చెందిన చాలా మంది నాయకులు ఇలా ఏపీలో తమ ఓటును అక్కడ రిజిష్టర్ చేయించుకుంటున్నారు!! ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు ముందుగా ఏపీలో తన ఓటును నమోదు చేసుకోవడానికి పవన్ ఏర్పాట్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
దీనికోసం ఏపీలోని ఏలూరు పట్టణాన్ని పవన్ ఎంచుకున్నట్టు కథనాలు వస్తోన్న తరుణంలో... పవన్ ఉండబోయే ఇల్లు ఇదే అని తెలుస్తోంది! సాధ్యమైనంత తొందరగా తాను ఏలూరులో నివాసాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పవన్ చెప్పినట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనుకున్నదే తడవుగా ఈ ఇల్లు కొనేశారని, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందని తెలుస్తోంది!! అయితే ఇది పవన్ నివసించే ఇల్లా లేక పార్టీ హెడ్ ఆఫీసా అన్నది తెలియాల్సి ఉంది!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/