రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీకి చెందిన వారిపై విమర్శలు గుప్పించడం....ఎద్దేవా చేయడం పరిపాటి. అయితే, చాలా సందర్భాల్లో రాజకీయాలు వేరు....వ్యక్తిగత జీవితం వేరు అని నిరూపితమైంది. రాజకీయం ఓ మతం వంటిది.....కానీ, ఆ మతం కన్నా మానవత్వం గొప్పదని అనేక సందర్భాల్లో స్ఫష్టమైంది. తాజాగా, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన ఓ అంతిమయాత్ర సందర్భంగా అరుదైన సన్నివేశం కనిపించింది. బందరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు దాసరి లక్ష్మణ రావు(బుడ్డా) అంతిమయాత్రలో ఏపీ మంత్రి పేర్ని నాని - మాజీ మంత్రి కొల్లు రవీంద్ర లక్ష్మణరావు పాల్గొనడమే కాకుండా స్వయంగా పాడె మోసి మానవత్వాన్ని చాటుకున్నారు.
లక్ష్మణ రావుకు అత్యంత సన్నిహితుడు - సుధా ఫోటో స్టూడియో ఓనర్ సుధాకర్ కొద్దిరోజుల క్రితం హఠాన్మరణం పాలయ్యారు. తన సన్నిహితుడి అకాల మరణంతో కుంగిపోయిన లక్ష్మణరావు కొన్ని రోజులుగా దిగులుగా ఉంటున్నారు. ఈ దిగులు, ఆలోచనతోనే లక్ష్మణరావుకు హఠాత్తుగా గుండెపోటు వచ్చి మరణించారు. జిల్లాలో పలువురు ప్రముఖులకు సుపరిచితుడైన లక్ష్మణరావు అంతిమయాత్రకు పార్టీలకతీతంగా పలువురు హాజరయ్యారు. లక్ష్మణరావు కుటుంబాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఫోన్లో పరామర్శించారు. త్వరలోనే లక్ష్మణరావు కుటుంబ సభ్యులను పవన్ వ్యక్తిగతంగా కలిసి సానుభూతి తెలపనున్నారట. లక్ష్మణరావు అంత్యక్రియలకు హాజరైన ఏపీ మంత్రి పేర్ని నాని, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర లక్ష్మణరావు పాడె స్వయంగా మోశారు. పేర్ని నానితో లక్ష్మణరావుకు సన్నిహిత సంబంధాలున్నాయి. పవన్కల్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు లక్ష్మణరావు పాడెను టీడీపీకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుతం అధికారంలో ఉన్న మంత్రి మోయడం విశేషం. రాజకీయాలు వేరు...వ్యక్తిగత జీవితం వేరు అని నిరూపించిన ఆ ఇద్దరిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.