పవన్‌ కల్యాణ్‌ కు రాజుల మద్దతు ఉంటుందా.?

Update: 2019-03-26 17:30 GMT
గాజువాకలో పవన్‌ కల్యాణ్‌ గెలుపు నల్లేరు మీద నడకే. ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు చాలా ఎక్కువ. కాపులు కానీ ఓట్లన్నీ దాదాపు పవన్‌ కల్యాణ్‌ అభిమానులే ఉన్నారు. కానీ భీమవరంలో అలాంటి పరిస్థితి లేదు. భీమవరంలో జనసేనాని జెండా ఎగరెయ్యాలంటే రాజుల మద్దతు తప్పనిసరి. భీమవరం నియోజకవర్గంలో కాపుల ఓట్లే ఎక్కువ. గతంలో రాజులు ఎక్కువుగా ఎమ్మెల్యేగా పోటీ చేసేవాళ్లు. దీంతో.. కాపులు - రాజులు అందరూ ఆ అభ్యర్థికే ఓటు వేసేవాళ్లు. ఇంకా చెప్పాలంటే రాజులు - కాపుల మద్దతు ఎవరికైతే ఉంటుందో వాళ్లు గెలవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ బరిలోకి దిగాడు. పవన్‌ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి.. కాపుల ఓట్లు కచ్చితంగా ఆయనకే పడతాయి. ఇక ఆయనకు కావాల్సింది రాజుల ఓట్లు. ఈ ఓట్లని బట్టే పవన్‌ కు వచ్చే మెజారిటీ ఆధారపడి ఉంటుంది.
  
భీమవరంలో ఉన్న కొంతమంది రాజులు ఆల్‌ రెడీ పవన్‌ కల్యాణ్‌ కు మద్దతు ఇచ్చారు. ఇంకొంతమంది మాత్రం తటస్థంగా ఉన్నారు. ఎవరైనా సినిమా స్టార్‌ పవన్‌ కోసం ప్రచారానికి వస్తే తటస్థంగా ఉన్న ఓట్లన్నీ పవన్‌ కే పడతాయి. ఉదాహరణకు యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌. ప్రభాస్‌ ది కూడా భీమవరమే. ప్రభాస్‌ పవన్‌ కి మద్దతు ఇస్తే.. ఇక పవన్ గెలుపుని ఆపడం ఎవ్వరితరం కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రబాస్‌ బయటకు వస్తాడా - మద్దతు ఇస్తాడా అనేది చెప్పలేం. ఇక స్టార్‌ కమెడీయన్‌ సునీల్‌ ది కూడా భీమవరమే. సునీల్‌ ది కూడా క్షత్రియ సామాజిక వర్గమే. సునీల్ మెగా ఫ్యామిలీకి వీరాభిమాని కాబట్టి కచ్చితంగా పవన్‌ కు మద్దతు ఇస్తాడు. త్రివిక్రమ్‌ ది కూడా భీమవరమే. పవన్‌ ని దాటి త్రివిక్రమ్‌ అసలు బయటికే వెళ్లడు కాబట్టి.. త్రివిక్రమ్‌ మద్దతు పవన్‌ కే. సో.. ఎలా చూసినా భీమవరం నుంచి వెళ్లి ఇండస్ట్రీలో సెటిల్‌ అయినవాళ్లు అందరూ ప్రస్తుతం పవన్‌ కే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అంటే.. భీమవరంలో కూడా పవన్ గెలుపుని ఆపడం ఎవ్వరి తరం కాదన్నమాట.


Tags:    

Similar News