మళ్లీ గంజాయి దందాపై పవన్ నిప్పులు

Update: 2021-10-29 06:30 GMT
ఏపీ డ్రగ్స్ కు కేంద్రంగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా మరోసారి నిలదీశారు. పలు రాష్ట్రాల పోలీసు అధికారులు చెప్పిన విషయాలను షేర్ చేశారు. తాను ఇదే విషయాన్ని 2018లో విశాఖ జిల్లా మన్యంలో పర్యటిస్తున్న సమయంలో ప్రస్తావిస్తున్న విషయాన్ని మళ్లీ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం ఈ ముప్పును అరికట్టాలని సూచించారు. ఈ వేల కోట్ల విలువైన గంజాయి వ్యాపారాన్ని అంతం చేయడానికి పటిష్టమైన చట్టాన్ని అమలు చేయడం అవసరం ఉందని అన్నారు.

ఓవైపు గంజాయి వ్యాపారానికి అడ్డుకట్ట వేస్తూ మరోవైపు యువతకు సమాన ఉపాధి అవకాశాలను సమాంతరంగా సృష్టించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. 2018 నుంచి ఏపీ యువతపైన మాదక ద్రవ్యాల ప్రభావం గురించి జనసేన అధినేత పవన్ చెప్తూనే ఉన్నారంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.అ దిప్పుడు వైరల్ గా మారింది. అప్పుడు పవన్ చెప్పింది.. ఇప్పుడు జరుగుతోందని కామెంట్ జతచేశారు.

గంజాయి సాగు అనేది యువతపై, సమాజంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. యువత ఆర్థిక పరిస్థితిపై తీవ్రప్రభావం చూపిస్తుందని అన్నారు. ముఖ్యంగా విశాఖ మన్యం నుంచి తుని వరకూ ఉపాధి లేని చదువు పూర్తి అయిన కుర్రాళ్లు ఈ ట్రేడ్ లో చిక్కుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యువత కాసుల కోసం పోలీసులకు చిక్కి భవిష్యత్ కోల్పోతున్నారని.. కింగ్ ప్రిన్స్ మాత్రం రిక్స్ లేకుండా డబ్బులు సంపాదిస్తున్నారని జనసేనాని ఎద్దేవా చేశారు.
Tags:    

Similar News