జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన విమర్శలు చేశారు. ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. ఆయన సర్కారు అవినీతిమయం అయిందన్నారు. అంతేకాకుండా ఆయన తనయుడు లోకేష్ అవినీతిపరుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ `చంద్రబాబుగారూ!, మీ అబ్బాయి లోకేష్ అవినీతి మీకు తెలిసే జరుగుతోందా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఫేస్ చేయాలంటే డబ్బులు కావాలని లోకేష్ అన్నారట - ఎంత సిగ్గు చేటు అని పవన్ అన్నారు. . ఇంత అవినీతి ఏమిటి అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు రాష్ట్రాన్ని స్కాం ఆంధ్రా చేయలేదు కానీ కరప్షన్ ఆంధ్రా చేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. `2019లో పవన్ మాతో ఉంటాడో లేడో తెలియదు కాబట్టి అవినీతికి పాల్పడతామంటే ఎలా? నారా లోకేష్ చేసే అవినీతి చూస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం అవినీతితో ప్రజల్లో భయం ఏర్పడింది. 2019 ఎన్నికలు టీడీపీకి 2014లో ఉన్నంత సుఖంగా మాత్రం ఉండబోవు. లోకేష్ కరప్షన్ చంద్రబాబుకు తెలుసా? లేదా?... లేకపోతే తెలిసే చేయిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్‌ని టీడీపీ ప్రభుత్వం కరప్షన్ ఆంధ్రాగా మార్చింది` అంటూ పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడా లేనంత అవినీతి ఏపీలో ఉంది... అవినీతి చేసేవాళ్లని తరిమి తరిమి కొట్టాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ రోజు నుంచి టీడీపీ వైఫల్యాలను ఎండగడుతామని - ఇసుక మాఫియాకు అమ్ముడు పోయినందకు నిలదీస్తామని పవన్ ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ప్రజలు కొత్త పార్టీని - కొత్త నాయకుడిని ఎన్నుకుంటారు... జనసేన ఉంది జనం కోసం అని పవన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.