మూడు దశాబ్దాల వెనక్కి వెళ్తే నందమూరి తారకరామారావు రాజకీయ అరంగేట్రం అప్పట్లో పెను సంచలనం. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సినీ నేపథ్యం నుంచి వచ్చినవాడు కాబట్టి అప్పట్లో జనాల్ని ఆకర్షించడానికి తనదైన శైలిలో చాలా ప్రయత్నాలే చేశాడు ఎన్టీఆర్. అందులో భాగంగా పరిశ్రమకు చెందిన కళాకారుల్ని.. గాయనీ గాయకుల్ని.. సంగీత దర్శకుల్ని ఆయన బాగా ఉపయోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీ విధానాల గురించి.. తాను చేపట్టదలిచిన కార్యక్రమాల గురించి ప్రజలకు మరింత సులువుగా అర్థం కావడానికి.. ప్రచారం జరగడానికి ఆయన ప్రత్యేకంగా పాటలు తయారు చేయించారు.
ఇప్పుడు ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో సాగుతున్నట్లు సమాచారం. ‘జనసేన’ను జనాల్లోకి పాటల ద్వారానే తీసుకెళ్లాలని భావిస్తున్నాడు పవన్. ఇందుకోసం తనతో పని చేసిన ఒక సంగీత దర్శకుడికి బాధ్యతలు అప్పగించాడట పవన్. తనకు సన్నిహితులైన గేయ రచయితలతోనూ సంప్రదింపులు జరిపి ‘జనసేన’ గీతాల్ని తయారు చేయిస్తున్నాడట. వీళ్లందరూ పవన్ నుంచి ఇన్ పుట్స్ తీసుకుని.. పాటలు రూపొందించే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే పవన్ ఈ పనుల్ని కూడా పర్యవేక్షిస్తున్నాడట. వచ్చే ఏడాది సినిమాలకు తెరదించేసి.. పూర్తిగా రాజకీయ కార్యకలాపాలపైనే దృష్టిసారించాల్సిన నేపథ్యంలో దానికి సంబంధించి బ్యాగ్రౌండ్ వర్క్ ఇప్పుడే పూర్తి చేస్తున్నట్లుగా ఉంది పవన్. మరి ఎన్టీఆర్ బాటలో నడుస్తున్న పవన్.. 2019 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రాబడతాడో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/