ట్వీట్లు ఓట్లుగా మారవు పవర్ స్టార్?

Update: 2020-08-19 02:30 GMT
నాడు ప్రజా నాయకుడు, సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం పొందిన తర్వాత తట్టుకోలేక చాలా మంది అభిమానుల గుండె పగిలి చనిపోయారు. ఆ అభిమాన గణం అంతా ఆయన కుమారుడు వైఎస్ జగన్ వెంట నడిచి ఇప్పుడు సీఎం పీఠం కట్టబెట్టింది.

అయితే తెలుగులో ఏ హీరోకు లేనంత అభిమాన గణం మన జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఉంది. పంతానికైనా.. పగోడిని ఓడించడానికైనా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తొడగొడితే ఏ హీరో తట్టుకోలేడు. అందుకు తాజా ఊదాహరణ ట్విట్టర్ లో ట్రెండింగే..

ఇటీవల మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులంతా ‘హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు’ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. ఏకంగా 5 కోట్లకు పైగానే ట్వీట్లు చేసి ట్విట్టర్ లో రికార్డ్ సృష్టించారు.

అయితే ఈ మహేష్ బర్త్ డే ట్వీట్ ట్రెండ్ ను ఓడించే ప్రయత్నంలో పవన్ ఫ్యాన్స్ సక్సెస్ అయ్యారు. ఏకంగా పట్టుబట్టి మరీ పవన్ ఫ్యాన్స్ 6.3 కోట్ల ట్వీట్లు (63 మిలియన్ ట్వీట్లు) పెట్టారు. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా ట్విట్టర్ లో రిలీజ్ చేశారు.ఇలా మహేష్ ఫ్యాన్స్ కు తొందరగానే షాకిచ్చారు.

నిజానికి ఇంత పట్టుదల, అభిమానం కనుక బయట ఎన్నికల్లో కనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూపిడితే పవన్ కు కనీసం రెండకల సీట్లు అయినా వచ్చేవి. సోషల్ మీడియాలో ఫైట్ చేస్తున్న ఫ్యాన్స్ పవన్ ఎంతో అభిమానించే రాజకీయాల్లో చేయడం లేదు. అదే పవన్ కు శాపమవుతోంది. ఈ 6.3 కోట్ల ట్వీట్లు చేసిన అభిమానులు అందులో సగం ఎన్నికల్లో పవన్ ను గెలిపించడానికి వాడినా ఇప్పుడు పవన్ రాజకీయ భవిష్యత్ మరోలా ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్వీట్లు ఓట్లుగా మారితే పవన్ తలరాతే మారేదని అంటున్నారు. కానీ పవన్ కు ఫ్యాన్సే బలం.. వారే బలహీనత అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News