రాయలసీమ పై జనసేన అధిపతి పవన్ కల్యాణ్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు ఒకింత వివాదాస్పదంగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో తన అనుభవాలను పవన్ కల్యాణ్ చెబుతూ.. ‘నెల్లూరు లో ఒక జనసేన కార్యకర్త తనతో మాట్లాడుతూ..ఫ్యాన్ రెక్కలు విరిచేయాలని తనతో అన్నాడని - అయితే తమది విరగదీసే సంస్కృతి కాదు అని - అది రాయలసీమకు చెందిన జగన్ లాంటి వారి అలవాటు..’అని తను చెప్పినట్టుగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఒకవేళ జగన్ మీద రాజకీయ విమర్శలు చేయాలనుకుంటే.. పవన్ కల్యాణ్ ఏమైనా అనుకోవచ్చు. జగన్ ను ఎలాగైనా విమర్శించుకోవచ్చు. అది ఎవరికీ అభ్యంతరం లేని విషయం. అయితే..జనసేన అధిపతి తన ప్రసంగాల్లో మధ్యలో ఎందుకు ‘రాయలసీమ’ ప్రస్తావన తెస్తున్నట్టు? అనేదానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
జగన్ ది రాయలసీమ ప్రాంతమే అయ్యుండొచ్చు.. కానీ రాయలసీమ అంటే జగన్ మాత్రమే కాదు - జగన్ రాయలసీమకు ప్రతినిధి కాదు కూడా. జగన్ పేరుకు ముందు పవన్ కల్యాణ్ రాయలసీమను అడ్రస్ చేయడం - రాయలసీమ అంటే రౌడీయిజం అన్నట్టుగా మాట్లాడం విడ్డూరంగా ఉంది. ప్రత్యేకించి గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పవన్ ఇలా మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమ అంటున్నారు - రౌడీయిజం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
కానీ పవన్ కల్యాణ్ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి.. తమకు సొంతం అనుకున్న గోదావరి జిల్లాలు తన అన్న చిరంజీవిని ఎమ్మెల్యేగా ఓడిస్తే..ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించింది రాయలసీమే. తిరుపతి నుంచినే చిరంజీవి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి రాయలసీమను పవన్ కల్యాణ్ ఇలా పదే పదే అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు రాయలసీమలో తన అభ్యర్థులను పోటీలో పెట్టి పదే పదే ఇలా రాయలసీమను కించపరుస్తూ మాట్లాడుతూ .. పవన్ కల్యాణ్ ఏం సందేశం ఇవ్వదలుచుకున్నట్టు?