జనసేన కార్యకర్తలు వీధుల్లోకి వచ్చారు. బెజవాడలో చోటు చేసుకున్న కాల్ మనీ కేటుగాళ్ల వ్యవహారంపై వారు నిరసన వ్యక్తం చేశారు. ఏపీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేయటంతో పాటు.. బెజవాడలోని వివిధరాజకీయ పార్టీ నేతలకు మంట పుట్టిస్తున్న కాల్ మనీ వ్యవహారంపై జనసేన కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాల్ మనీ కేటుగాళ్ల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వారు.. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జనసేన కార్యకర్తలు.. కాల్ మనీ పేరిట అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయటంతో పాటు.. కామ కేటుగాళ్లను ఉరి తీయాలంటున్నారు. రాజకీయ నేతలు సిండికేట్లుగా మారి.. కాల్ మనీ పేరిట సామాన్యుల్ని దగా చేయటంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న అందరిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. జనసేన కార్యకర్తల డిమాండ్ సముచితంగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.