గ‌మ‌నించారా?:జ‌గ‌న్ చెప్పిందే ప‌వ‌న్ చెప్పారు

Update: 2018-03-05 05:12 GMT
ఇంటి భోజ‌నం ఎవ‌రికి న‌చ్చ‌ద‌ని ఊరికే అన‌లేదు. ప‌క్కింటోళ్లు పుల్ల ప‌చ్చ‌డి వేసినా కొత్త కొత్త‌గా ఉంటుంది. ఇది ఎప్పుడూ ఉండేదే. ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం ఎంత‌న్న విష‌యంపై మొద‌ట్ని ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న విష‌యాల్ని ప‌ట్ట‌న‌ట్లుగా ఉండి.. ఇప్పుడేదో కొత్త విష‌యాన్ని క‌నుగొన్న‌ట్లుగా చెప్ప‌టం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కే చెల్లుతుంది.

ఏపీ విభ‌జ‌న అనంత‌రం ప్ర‌త్యేక హోదా మీద అదే ప‌నిగా పోరాటాలు.. నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌లు చేప‌ట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే. ప్ర‌త్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్య‌మ‌ని చెప్ప‌ట‌మే కాదు.. మ‌ధ్య‌లో బాబు పిల్లి మొగ్గ‌లు వేసి హోదాకు తూచ్ చెప్పేసి.. ప్ర‌త్యేక ప్యాకేజీకి ఓకే చెప్పిన‌ప్పుడు కూడా అది త‌ప్పు అని.. వ్యూహాత్మ‌క పొర‌పాటుగా నెత్తినోరు కొట్టుకున్నది జ‌గ‌న్ పార్టీనే.

హోదా రాకుంటే ఢిల్లీకి వెళ్లి మ‌రీ నిర‌స‌న చేస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. ప్ర‌త్యేక ప్యాకేజీ విష‌యంలో బాబు తీరుతో క‌న్ఫ్యూజ‌న్ కు గురైన సంగ‌తి మ‌ర్చిపోకూడ‌దు. హోదా మీద సీజ‌న్ల వారీగా ప‌వ‌న్ స్పంద‌న ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఇప్పుడు హోదా త‌ప్ప‌నిస‌రి అన్న మాట‌తోపాటు.. ఇంత‌కాలం ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్రం అందించిన తోడ్పాటు ఎంత‌న్న విష‌యంపై జేఎఫ్‌ సీ నివేదిక‌ను త‌యారు చేయించి గ‌గ్గోలు పెడుతున్న ప‌వ‌న్ బ్యాచ్ కొత్త‌గా బ‌య‌ట‌పెట్టింది ఏమైనా ఉందా? అంటే లేద‌నే చెప్పాలి.

ఎందుకంటే.. ప్ర‌త్యేక హోదా కింద రావాల్సిన‌వేమీ రాష్ట్రానికి రాలేద‌ని.. ప్ర‌త్యేక‌హోదాతోనే రాష్ట్రానికి మేలు జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ మొద‌ట్నించి చెబుతున్నాదే.

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం విశాఖ‌కు రైల్వే జోన్.. దుగ‌రాజుప‌ట్నం.. ఓడ‌రేవు.. క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ త‌దిత‌రాలు రాష్ట్రానికి రావాల్సి ఉన్నాయంటూ చెప్పిన అంశాల్నే ప‌వ‌న్ ఏర్పాటు చేసిన సంయుక్త నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ చెప్ప‌టం మ‌ర్చిపోకూడ‌దు. మొత్తంగా చూస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొద‌ట్నించి చెబుతున్న అంశాలు.. డిమాండ్ చేసిన వాటి మీద‌నే ప‌వ‌న్ ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ నిర్దారించ‌టంతో పాటు.. వాటినే మ‌రోసారి చెప్పిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.  ప‌వ‌న్ బ్యాచ్ వెలికి తీసిన విష‌యాల‌న్నీ.. కాపీ క‌ట్ పేస్ట్ మాదిరి ఉండ‌టం గ‌మనార్హం.
Tags:    

Similar News