పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో ఆవేశంగా చేసిన ప్రసంగంలో కొన్ని సంచలన ప్రకటనలు కూడా అలవోకగా దొర్లిపోయాయి. అవేంటి అంటే నేను ఇక్కడే ఉంటా, ఏపీలోనే ఉంటా, మంగళగిరిలోనే ఉంటా. వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిని ఎండగడతా అంటూ ఊగిపోయారు. ఆ స్పీడ్ లో ఆయన ఇక్కడే ఉంటా అంటూ చేసిన కామెంట్స్ ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
అయితే పవన్ మనసులో ఉన్నవి కాబట్టే అవి అలా బయటకు వచ్చేశాయి. దానికి కొంత బలాన్ని ఇచ్చే విధంగా మరోటి కూదా జరిగింది. ఇటీవల మంగళగిరిలో పవన్ యాగం చేశారు. దానికి హాజరైన సినీ ప్రముఖులు ఇక్కడే తాము తొందరలోనే పవన్ తో సినిమా షూటింగులు చేస్తామని చెప్పారు.
దాన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ ఏపీలో కాపురం పెట్టేస్తున్నారు అన్నది నిజమే అనుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ కి ఏపీలో సొంత ఇల్లు అయితే లేదు, కానీ మంగళగిరిలో బ్రహ్మాండమైన పార్టీ ఆఫీస్ ఉంది. అక్కడ మరిన్ని కొత్త భవనాల నిర్మాణానికి ఆయన ఇటీవల శంకుస్థాపన చేశారు.
దాంతో పవన్ అక్కడే ఉంటారని అంటున్నారు. మొత్తానికి ఎన్నికల ఏడాదిలో పవన్ ఏపీలో ఉండేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే పవన్ ఏపీలోనే పూర్తిగా ఉంటారా లేదా అన్నది ఎన్నికల అనంతరం చూడాలని అంటున్నారు. ఈసారి ఏపీలో విడిగానో ఉమ్మడిగానో అధికారంలోకి వస్తామని పవన్ గట్టిగా భావిస్తున్నారు అని అంటున్నారు.
ఇక ఎక్కువ సీట్లు పొత్తులో తీసుకుని పోటీ చేస్తే హంగ్ ఏర్పడిన పక్షంలో తనకూ సీఎం చాన్స్ ఉంటుందని ఆయన ఆశిస్తున్నారని అంచనా కడుతున్నారని అంటున్నారు. అది కనుక జరగకపోయినా టీడీపీ ప్రభుత్వంలో మంత్రి అయినా అవాలన్న కోరిక కూడా ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈసారి అధికారంలో తానూ ఉంటానని బలంగా నమ్ముతున్న పవన్ ఏపీకి ఇక పర్మనెంట్ గానే షిఫ్టింగ్ అన్నది డిసైడ్ చేసుకున్నారని అంటున్నారు.
అయితే ఒకవేళ మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చి తాము అనుకున్న అంచనాలు మారితే పవన్ ఏమి చేస్తారు అన్నదే చర్చ. అపుడు కూడా ఆయన ఏపీలోనే నివాసం ఉంటారా అన్నదే ఇపుడు వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న. ఎన్నికల వేళ మాత్రమే ఏపీలో అడ్రస్ చూపించి ఓడితే హైదరాబాద్ మకాం మార్చే విపక్ష నేతలు అవసరమా అంటూ వైసీపీ సంధిస్తున్న ప్రశ్నలు జనాల్లో నాటుకోకముందే పవన్ నేను నా ఇక మీదట జీవితం అంతా ఏపీతోనే అని ఒక కచ్చితమైన స్టేట్మెంట్ ఇస్తే అది జనసేన విజయానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. నేను ఏపీనే మంగళగిరిలోనే ఉంటాను అని పదే పదే పవన్ చేస్తున్న ప్రకటనలను అసలు ప్రజలు ఎంతవరకూ నమ్ముతారు అన్నది కూడా చూడాలని అంటున్నారు.